తెల్లగా మారిన జుట్టుకు..


Mon,December 24, 2018 01:16 AM

చాలామందిలో చిన్నతనంలోనే జుట్టు తెల్లబడి పోతుంది. ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా కూడా ఇలా జరుగొచ్చు. సహజ పద్ధతుల్లో చేస్తే తెల్ల జుట్టు కూడా నల్లగా నిగనిగలాడుతుంది.
white-hair
-ఉసిరిపొడి చేసుకోండి. అందులో నిమ్మరసం కలిపి పేస్ట్ మాదిరిగా చేసుకోండి. దాన్ని రోజూ తలకు పూసుకొని రెండు గంటలాగి తలస్నానం చేయండి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.
-ఉల్లిగడ్డను మెత్తగా మిక్సీ చేయాలి. ఈ పేస్ట్‌ను తెల్ల వెంట్రుకలు ఉన్న చోట రాయండి. రెండు గంటలు ఆగి తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా తరుచుగా చేయాల్సి ఉంటుంది.
-కొబ్బరినూనెలో నిమ్మరసం కలుపాలి. రోజూ ఈ రసం తలకు పూసుకుంటూ ఉంటే జుట్టు నల్లగా మారుతుంది. అలాగే తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది.
-నువ్వులను మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి. ఇందులో బాదం ఆయిల్ మిక్స్ చేయాలి. దీన్ని తరుచుగా తలకు రాస్తుండాలి.
-రోజూ క్యారెట్ జ్యూస్ తాగితే కూడా జుట్టు నల్లబడుతుంది. ఫుడ్‌లో ప్రొటీన్స్, విటమిన్ బి12 ఎక్కువగా ఉండాలి.

864
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles