తిరుగులేని తుమ్మ జిగురు


Tue,February 26, 2019 01:32 AM

Elagante
మనకు తెలిసినంత వరకు ప్రత్యేకించి తుమ్మ వంటి చెట్ల నుంచి వచ్చే సహజ సిద్ధమైన జిగురు ఎంతో శక్తివంతమైంది. కాగితాలు, బట్టలు వంటి వాటిని అతికించడానికి ఇది బాగా పనిచేస్తుంది. చెట్టు నుండి ఇది బంకలా చిక్కటి ద్రవం వలె కాండం పొడుగునా కారుతూ ఉంటుంది. ఇతరేతర చెట్ల నుంచి కూడా ఒక రకమైన ద్రవపదార్థం కారినా వాటికి అంటుకొనే గుణం ఉండదు. కొన్ని ఆకులు, పూల కాడల నుంచి కూడా చిక్కని ద్రవాలు వస్తుంటాయి. కిరణజన్య సంయోగక్రియ ఫలితంగానే ఇలాంటి స్రావాలు మొక్కలకు ఊరతాయని శాస్త్రవేత్తలు అంటారు. తుమ్మజిగురును సేకరించి గమ్ (గోందు లేదా జిగురు)లా వాడుకొనే వారు ఎందరో.


దీనిని గాలిలో వుంచితే వెంటనే గట్టిపడిపోతుంది. కానీ, నీటిలో కరుగుతుంది. నీటిలో కూడా కరగని జిగురులూ ఉన్నట్టు చెబుతున్నారు. చెట్ల జిగురు వాటి బెరడు లోపలి నుంచి వస్తుంది. ఈతచెట్లకు కల్లు వచ్చినట్లు! కొన్ని చెట్లకైతే ఇది పెద్ద మొత్తంలో కారుతుంటుంది. చూడడానికి చెట్టుకేదో గాయమైనట్టు అనిపిస్తుంది. ఇది చాలా మందమైన, బరువుతో కూడిన ద్రవ పదార్థం. ఇలాంటి సహజ సిద్ధమైన జిగురు ప్రపంచంలో మరెన్నో రకాల చెట్ల నుంచి కూడా వస్తుందని అంటున్నారు. కొన్ని జిగురులైతే నీటిని పీల్చుకొని మరింత జిగటగా తయారవుతై.

622
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles