తియ్యని వేడుక


Thu,February 14, 2019 02:07 AM

Love-Cake
ప్రేమంటే ఒక తియ్యని అనుభూతి.. ప్రేమ అదో రెండక్షరాల తియ్యని మైకం.. ఈ తీపిలో మరింత తియ్యదనం చేరేందుకు.. ప్రియమైన వారి నోరు తీపి చేసేందుకు.. కచ్చితంగా చాక్లెట్ బాక్స్ తీసుకెళ్లే ఆనవాయితీ ఉంటుంది.. కానీ ఈ వాలెంటైన్స్ కొత్తగా చేసుకోండి.. మీ ఇష్టులకు.. చాక్లెట్‌తో తియ్యని వంటకాలను మీ చేతితో చేసి.. మీ తియ్యని ప్రేమను వారికి రుచి చూపించండి..

చాక్లెట్ మౌసీ

CHOCOLATE-MOUSSE

కావాల్సినవి :

డార్క్ చాక్లెట్ : అర కప్పు, వైప్ క్రీమ్ : ఒక కప్పు, కోడిగుడ్డులోని పచ్చసొన : 1, రెడ్ వైన్ : ఒక టీస్పూన్, క్కెర : ఒక టీస్పూన్

తయారీ :

స్టెప్ 1 : ఒక గిన్నెలో కోడిగుడ్డు పచ్చసొనను వేసి గిలక్కొట్టాలి. దీంట్లో కొద్దిగా గోరువెచ్చని నీళ్లు పోసి కలుపాలి.
స్టెప్ 2 : ఇందులో రెడ్ వైన్, చక్కెర వేసి బాగా కలుపాలి. ఆ తర్వాత డార్క్ చాక్లెట్, వైప్ క్రీమ్‌ని కొద్ది కొద్దిగా వేస్తూ బాగా మిక్స్ చేయాలి.
స్టెప్ 3 : ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గాజు గ్లాసులోకి తీసుకొని పై నుంచి చాక్లెట్‌ని కరిగించి పోయాలి. రుచికరమైన చాక్లెట్ మౌసీని లొట్టలేసుకుంటూ లాగించేయొచ్చు.

కోకో చాక్లెట్ మిల్క్‌షేక్

MILKSHAKE

కావాల్సినవి :

డార్క్ చాక్లెట్ : ఒక టీస్పూన్ (కరిగించింది), పాలు : 2 కప్పులు, కోకో పౌడర్ : ఒక కప్పు, చక్కెర : ఒక టేబుల్‌స్పూన్, ఐస్‌క్రీమ్ : ఒక టేబుల్‌స్పూన్, ఐస్‌క్యూబ్ : 1, చాక్లెట్ తురుము : అర కప్పు

తయారీ :

స్టెప్ 1 : పాలను బాగా మరిగించి కాసేపు చల్లారనివ్వాలి.
స్టెప్ 2 : మిక్సీలో పాలు, కోకో పౌడర్, డార్క్ చాక్లెట్, చక్కెర, చాక్లెట్ తురుము వేసి గ్రైండ్ చేయాలి.
స్టెప్ 3 : దీంట్లో ఐస్‌క్రీమ్ వేసి మరొకసారి మిక్సీ పట్టాలి. చివరగా ఐస్ క్యూబ్ వేసి చల్లగా అందివ్వాలి.
టేస్టీ మిల్క్ షేక్ మీ ముందుంటుంది.

చాక్లెట్ దోశ

CHOCOLATE-DOSA

కావాల్సినవి :

పాలు : ఒక కప్పు, చాక్లెట్ : పావు కప్పు, బటర్ : అర టీస్పూన్, మైదా : 3/4 కప్పు, బేకింగ్ పౌడర్ : పావు టీస్పూన్

తయారీ :

స్టెప్ 1 : పాలను వేడి చేసి దించేయాలి. దీంట్లో చాక్లెట్ వేసి బాగా కలుపాలి.
స్టెప్ 2 : ఇందులోనే బటర్, మైదా, బేకింగ్ పౌడర్ వేసి ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుకొని కాసేపు పక్కన పెట్టాలి.
స్టెప్ 3 : పెనం పెట్టి.. కాస్త వేడయ్యాక బటర్ రాసి ఈ మిశ్రమాన్ని దోశలా పోసుకోవాలి. రెండు వైపులా కాల్చుకొని తినాలి. దీంట్లోకి చట్నీ లేకున్నా తియ్యగా ఆరగించేయొచ్చు.

చాక్లెట్ కేక్

EGGLESS-CHOCOLATE-CAKE

కావాల్సినవి :

కోకో పౌడర్ : 2 టేబుల్‌స్పూన్స్, పాలు : ఒక కప్పు, బటర్ : 3/4 కప్పు, వెనీలా ఎసెన్స్ : ఒక టేబుల్‌స్పూన్, మైదా : 1 1/2 కప్పులు, బేకింగ్ పౌడర్ : ఒక టీస్పూన్, బేకింగ్ సోడా : అర టీస్పూన్, సోడా : 100 మి.లీ.

తయారీ :

స్టెప్ 1 : పాలను మరిగించి పెట్టాలి. ఈ గిన్నెలో బటర్, వెనీలా ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి.
స్టెప్ 2 : మరో గిన్నెలో మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, కోకో పౌడర్ వేసి కలుపాలి. ఈ మిశ్రమాన్ని పాల గిన్నెలో జల్లెడ పట్టి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి.
స్టెప్ 3 : ఆ తర్వాత సోడా వేస్తూ జాగ్రత్తగా కలిపి కాసేపు పక్కన పెట్టాలి. ఈలోపు ఓవెన్ 180 డిగ్రీ సెంటీగ్రేడ్‌ల వద్ద ముందే వేడి చేసి పెట్టాలి.
స్టెప్ 4 : బేకింగ్ డిష్‌లో బటర్ పేపర్ వేసి ఆ మిశ్రమాన్ని జాగ్రత్తగా వేయాలి. అరగంట పాటు 180 డిగ్రీల సెంటీగ్రేడ్స్ వద్ద కేక్‌ని బేక్ చేయాలి. పది నిమిషాల తర్వాత తీసి కట్ చేసి
తినేయొచ్చు.

చాక్లెట్ పై

CHOCOLATE-PIE

కావాల్సినవి :

చాక్లెట్ : అర కప్పు, బటర్ : 20 గ్రా., క్యాస్టర్ షుగర్ : 2 టేబుల్‌స్పూన్స్, మైదా : 40 గ్రా., పాలు : ఒక టీస్పూన్, ఫ్రెష్ క్రీమ్ : అర కప్పు, ఉప్పు : చిటికెడు

తయారీ :

స్టెప్ 1 : ఒక గిన్నెలో బటర్, క్యాస్టర్ షుగర్, చక్కెర వేసి బాగా కలుపాలి. ఇందులో మైదా, పాలు పోసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి.
స్టెప్ 2 : స్టార్‌లా ఉండే మౌల్డ్ తీసుకొని ఈ మిశ్రమాన్ని దానికి రాయాలి. దీన్ని పదిహేను నిమిషాల పాటు ఓవెన్‌లో 180 డిగ్రీల సెంటీగ్రేడ్స్ వద్ద బేక్ చేయాలి.
స్టెప్ 3 : ఇది చల్లారే లోపు గిన్నెలో ఫ్రెష్ క్రీమ్, చాక్లెట్ వేసి రెండు నిమిషాల పాటు స్టౌ మీద పెట్టి దించేయాలి.
స్టెప్ 4 : ఇప్పుడు స్టార్ పైని ఒక ప్లేట్‌లో పెట్టి మధ్యలో ఈ చాక్లెట్ మిశ్రమాన్ని పోయాలి. పై నుంచి క్రీమ్‌తో గార్నిష్ చేసి గంటసేపు ఫ్రిజ్‌లో ఉంచి చల్ల్లగా ఆరగించేయొచ్చు. లేదా అప్పుడే వేడిగా తిన్నా బాగుంటుంది.

-సంజయ్ తుమ్మ
-సెలబ్రిటీ చెఫ్

571
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles