తామర నివారణకు చిట్కాలు


Fri,April 12, 2019 01:06 AM

వాతావరణంలో ఎక్కువ వేడి, ముఖ్యంగా ఎండాకాలం, తరచూ ఉష్ణోగ్రతల్లో మార్పులు, ఒత్తిడి మొదలైనవి ఎగ్జిమా(తామర)కు దారితీస్తాయి.
egjima
-గోరువెచ్చని నీటిలో ఒక కప్పు మినరల్ ఆయిల్‌ను వేసి స్నానం చేయాలి. అలాగే ఓట్ మీల్ మిక్స్ వేసి కూడా స్నానం చేయవచ్చు. పాలు, ఆలివ్ ఆయిల్ సమంగా మిక్స్ చేసి వేడి నీళ్లలో కలిపి స్నానం ఏస్తే ఎగ్జిమా నయం అవుతుంది.
-పసుపులో యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉంటాయి. స్నానం చేసే సమయంలో నీటిలో పసుపు వేసుకుని స్నానం చేస్తే కొంత మేర చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఒక టేబుల్ స్పూన్ పసుపులో 3 చెంచాల రోజ్ వాటర్ మిక్స్ చేసి చర్మానికి పూర్తిగా ఐప్లె చేయాలి. ఇలా చేస్తుంటే ఎగ్జిమా తగ్గుతుంది.
-కలబందలోనూ ఎగ్జిమాను తగ్గించే గుణాలు పుష్కలంగా ఉంటాయి. చర్మంపై దురద, లేదా మంట ఉన్న ప్రదేశంలో కలబంద గుజ్జును రాసినా కూడా ఎగ్జిమా తగ్గుతుంది. ఇలా వారం పాటు చేస్తే ఫలితం కనిపిస్తుంది.
-కొబ్బరి నూనె, జోజోబ ఆయిల్‌ను గోరువెచ్చని నీళ్లలో వేసి స్నానం చేయాలి. ఈ నూనెతో మసాజ్ చేయకూడదు. నూనెను కాస్త ఐప్లె చేసి స్నానం చేయాలి. గ్లిజరిన్ కూడా ఎగ్జిమాను నివారిస్తుంది. దానిని కొద్దిగా నీటిలో కలిపి ప్రభావిత ప్రాంతంలో పూస్తే ఫలితం ఉంటుంది. 5 నిమిషాల తర్వాత స్నానం చేయాలి.

144
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles