తానేంటో నిరూపించుకుంది!


Sat,January 12, 2019 12:59 AM

అది 2010 మే 28. అర్ధరాత్రి 1.30 గంటలు అవుతున్నది. జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ కోల్‌కతా నుంచి ముంబైకి వస్తున్నది. రైలులోని ప్రయాణికులంతా గాఢ నిద్రలోకి జారుకున్నారు. ఆ తర్వాత ఓ ఘోర ఉప్రదవం.. ఈ యువతి జీవితాన్ని మలుపు తిప్పింది.
ShreyaSenShrivastava
ఆ రోజు జరిగింది నక్సల్స్ దాడి. జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్‌ను ధ్వంసం చేసి, అల్లర్లు సృష్టించేందుకు నక్సల్స్ ఓ గూడ్స్ ట్రెయిన్‌తో ఎదురుగా ఢీకొట్టించారు. దీంతో అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్ధం. కళ్లు తెరిస్తే.. ఆర్తనాదాలు, ఆహాకారాలు. అంతా తమవారి కోసం వెతుకుతున్నారు. ఎవరు ఎక్కడున్నారో తెలియదు. ఎంతమంది చనిపోయారో తెలియదు. అక్కడంతా భయానక వాతావరణం అలుముకుంది. ఆ దాడిలో శ్రేయాసేన్ అనే ఈ యువతి కూడా తీవ్రంగా గాయపడింది. రైలు భోగీలు నుజ్జునుజ్జు అవడంతో తన కుడి చేయి చితికిపోయింది. ఆమె సోదరుడు హుటాహుటిన ఆస్పత్రికి తరలించాడు. వైద్యులు కుటుంబీకులతో మాట్లాడి శ్రేయా కుడిచేతిని పూర్తిగా తొలిగించారు. అప్పటికి శ్రేయా ఆర్కిటెక్చర్ చదువుతుంది. జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నది. ఆ బాధతో కొద్దిరోజులు కాలేజ్‌కు వెళ్లలేదు. ఆ సమయంలో స్నేహితులు, కుటుంబసభ్యులు శ్రేయాకు అండగా నిలిచారు. ఎందుకంటే ఆర్కిటెక్చర్ విద్యార్థులు ఏదో ప్లాన్ గీస్తూనే ఉండాలి. ఒక చేయి లేకపోతే ఎలా? అనేది శ్రేయా బాధ. అయినా భరించి కాలేజ్‌కు వెళ్లింది. తన పట్టుదలను చూసి కాలేజ్ అధ్యాపకులు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించారు. అలా కష్టపడి చదివి ఆర్కిటెక్చర్‌గా నిలిచింది. త్వరలో యాన్యువల్ నాసా వర్క్‌షాపులో పాల్గొననున్నది. ఈ క్రమంలో మద్రాస్‌కు చెందిన ఐఐటీ రూర్కీ విద్యార్థి ప్రతీక్‌ను పెండ్లి చేసుకుంది. డిసేబులిటీ టు ఎబిలిటీ అనే అంశంపై ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతున్నది శ్రేయా.

408
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles