తాటిముంజలు తింటున్నారా?


Sat,March 16, 2019 01:52 AM

వేసవిలో మాత్రమే లభించే తాటిముంజల వల్ల అనేక ప్రయోజనాలున్నాయని మీకు తెలుసా? ఆరు అరటిపండ్లు తింటే వచ్చే పొటాషియం ఒక్క తాటిముంజలో దొరుకుతుందంటే నమ్మగలరా? వీటిని ఐస్ ఆపిల్స్ అని అంటారు. తాటిముంజల గురించి కొన్ని విషయాలు.
thatikayalu
-తాటిముంజలు శరీరంలో చెడు కొవ్వును కరిగిస్తాయి.
-ఇందులో ఉండే కాల్షియం ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది. రోగనిరోధక శక్తినీ పెంచుతుంది.
-ముంజల్లో ఉండే ఏ, బీ, సీ విటమిన్లు, పాస్పరస్, పొటాషియం వంటి పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
-తాటిముంజలు తినడం వల్ల బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. ఎండ వేడిమికి శరీరంలో కలిగే గ్లూకోజ్ హెచ్చుతగ్గులను నివారిస్తుంది.
-గుండె, షుగర్ వ్యాధితో బాధపడేవారు, లివర్ సమస్యతో సతమతమవుతున్న వారికి తాటిముంజలు మంచివి.
-మొటిమలతో బాధపడుతున్న వారు తాటిముంజలు తింటే తగ్గుముఖం పడతాయి.
-వేసవితాపానికి శరీరం డీహైడ్రేషన్‌కి గురవుతుంది. ఆ సమయంలో తాటిముంజలు తింటే ఉపశమనం పొందవచ్చు.
-క్యాన్సర్ కణాల నిరోధానికి ముంజలు ఉపయోగపడుతాయి. ట్యూమర్, బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను అభివృద్ధి చేసే పెట్రో కెమికల్స్, ఆంథోసైనిన్‌లాంటి వాటిని నిర్మూలిస్తాయి.
-తాటిముంజల్లో ఉండే పొటాషియం శరీరంలో పేరుకున్న విషపదార్థాలను తొలిగించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.

1749
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles