తల్లి ధైర్యం.. చిరుత పరార్!


Wed,April 24, 2019 12:10 AM

బిడ్డ తల చిరుత నోటి దగ్గర చూసిన ఆ తల్లి ముందూ వెనకా ఆలోచించలేదు. శివంగిలా చిరుత మీదకి దుమికింది. పిడి దెబ్బలతో చిరుతను తరిమి కొట్టింది.
leopard
పుణెకు 90 కిలోమీటర్ల దూరంలోని దోల్వాద్ గ్రామం. దిలీప్, దీపాలి దంపతులు. వీరికి ద్యానేశ్వర్ మలి అనే 18 నెలల కొడుకు ఉన్నాడు. దంపతులు కూలీలు. చెరుకు నరికి జీవనం సాగిస్తున్నారు. దోల్వాద్ గ్రామంలో ఓ చిన్న గుడిసెలో నివాసం ఉంటున్నారు. అదంతా అటవీ ప్రాంతం, చెరుకు పంట విస్తారంగా ఉన్న ప్రాంతం. అటవీ జంతువుల భయం ఉంటుంది. ఇటీవల దీపాలి తన కుమారునితో కలిసి గుడిసె బయట నిద్రపోతున్నది. అప్పుడే ఆమెకు విచిత్రమైన శబ్ధాలు వినిపించాయి. లేచి చూస్తే భయంకరమైన ప్రమాదాన్ని కండ్ల నిండా చూసింది. ఓ చిరుత నోరు ఆమె కొడుకు దగ్గర ఉంది. వెంటనే తేరుకున్న దీపాలి క్షణాల్లో చిరుత మీదికి దూకింది. పిడికిలి దెబ్బలతో చిరుతను చితక్కొంట్టింది. ఈ క్రమంలోనే గ్రామస్తులకు వినిపించేలా పెద్దగా అరిచింది. విషయం గమనించిన గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఆమె దగ్గరకు చేరుకున్నారు. అప్పుడు చిరుత భయంతో అడవిలోకి పరుగులు తీసింది. దీపాలికి గాయాలయ్యాయి. అయినా బిడ్డను కాపాడుకోగలిగాను అంది సంతోషంగా. విషయం తెలుసుకున్న స్థానిక అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గాయాలతో ఉన్న దీపాలికి, బిడ్డకు చికిత్స అందించారు. బిడ్డను కాపాడుకోవడం తప్ప నాకేమీ ఆలోచన రాలేదు అంటున్నది దీపాలి.

400
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles