తలమానికంగా తలపాగాలు


Tue,March 5, 2019 03:11 AM

Sucharitha
వివిధ కారణాల వల్ల తలకు ధరించే టోపీకి చాలా సుదీర్ఘ చరిత్రే ఉంది. ప్రాచీనకాలంలోని కిరీటాల నుంచి ఇప్పటి హెల్మెట్ల దాకా, తలపాగాల నుంచి సాంప్రదాయిక దస్తార్‌లు (సిక్కులు ధరించేవి), పెండ్లికొడుకులు ధరించే ప్రత్యేక పాగాల (టర్బన్) వరకు ఇవి అనేక విధాలుగా రూపాంతరం చెందుతూ వచ్చాయి. తొలుత తలకు రక్షణగా మొదలైన ఈ టోపీల వాడుక రాన్రాను ఒక ఫేషన్‌గా, గౌరవ సూచకంగానూ, చివరకు అధికారిక చిహ్నాలు (పోలీసులు, మిలట్రీ వారు ధరించేవి)గా, దేవతారాధన వేళ దేవుడి శఠగోపం వరకూ ఎదిగాయి. ఎండ, అననుకూల వాతావరణం నుంచి రక్షణకైతేనేం మధ్యయుగాల నాటికి ఎన్నెన్నో టోపీలు చాలా పాపులర్ అయ్యాయి. 16వ శతాబ్దం నాటికి గౌరవప్రదమైన కిరీటాలుగా, 17, 18 శతాబ్దాలకల్లా తలనిండా కప్పుకోగల గుండ్రని, త్రిభుజాకార పాగాలుగా టోపీలు తయారైనాయి. టోపీల పైన సిల్కు రిబ్బన్ల కుచ్చులు, పక్షుల ఈకలు వంటివాటితో అలంకరించేవారు. ఆధునిక టోపీలలో పనామ, బౌలర్, ఫెడోరా, ట్రెల్బీ, క్లోచ్, పిల్‌బాక్స్ పేర్న పిలిచే టోపీలైతే చాలా ప్రసిద్ధమైనాయి. క్రీ.పూ. కొన్ని వేల సంవత్సరాల కిందట ప్రజలు టోపీలు ధరించినట్టు శాస్త్రీయ ఆధారాలేవీ ఇప్పటికి లభించకున్నా సుమారు 30,000 సంవత్సరాల కిందటిదిగా చెప్పే వినస్ ఆఫ్ విల్లెండార్ఫ్ నగ్నమహిళ విగ్రహం (1908లో తవ్వకాలలో వెలుగుచూసింది) టోపీని ధరించి ఉండడం గమనార్హం.

286
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles