-దుర్వాసనకు కారణమయ్యే సూక్ష్మజీవులు, ఫంగస్‌ను నిమ్మలో ఉండే ఎసిటిక్ ఆమ్లం నిరోధిస్తుంది. బకెట్లో ఒక చెక్క నిమ్మరసం పిండి తడివాసన వచ్చే బట్టలను అందులో ముంచి ఆరేయండి. ముక్కవాసన రాదు. ఆ నీటితో ఇల్లు తుడిస్తే కూడా ఇల్లు ఫ్రెష్‌గా ఉంటుంది.
-వెనిగర్‌కి కూడా ఫంగస్‌ని నిర్మూలించే శక్తి ఉంది. వెనిగర్ కలిపిన నీటిని ఇల్లంతా చల్లి, తుడిస్తే ఫలితం ఉంటుంది.
-ఉప్పు తేమను మింగేస్తుంది. దుర్వాసనకు చెక్ పెడుతుంది. ఖర్చిప్లో ఉప్పు వేసి మూటలా కట్టి ఎక్కడ దుర్వాసన వస్తుందో అక్కడ ఉంచండి. ఆ వాసన అంతా ఉప్పు పీల్చేసుకుంటుంది.
-ముక్కును ఇబ్బంది పెట్టే ఏ దుర్వాసన అయినా వంటసోడా ముందు తల వంచాల్సిందే. వాసన వచ్చే దగ్గర కాస్త వంటసోడా చల్లండి. మార్పు కనిపిస్తుంది.