తడవని చీర!


Wed,February 20, 2019 01:21 AM

కుంభమేళ అంటేనే కిక్కిరిసే జనం పోగవుతారు. నదీ స్నానాలు ఉంటాయి. ఆడవాళ్ల కోసం ప్రత్యేకంగా హమామ్ సోప్ బ్రాండ్ యజమాన్యం నీళ్లలో మునిగినా తడవని చీరను పంచి పెడుతున్నది.
waterproofsaris
ఒక మహిళ ఎక్కడికి వెళ్లినా వందమంది మగవాళ్ల కళ్లు ఆమె చుట్టూనే తిరుగుతుంటాయి. కాబట్టి ఎక్కడికి వెళ్లినా జాగ్రత్తగా ఉండాలి. మామూలుగా ఉమెన్ కుంభమేళా అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే తడిసి ముద్దయిపోయిన ఆడవాళ్ల ఫొటోలే ఎక్కువగా కనిపిస్తాయి. భక్తి భావంతో వాళ్లు ఉంటే.. ఎంచక్కా వాళ్లని ఫొటోలు తీసి క్యాష్ చేసుకునే వాళ్లూ లేకపోలేదు. అలాంటి మూర్ఖపు జనాల నుంచి ఆడవాళ్లను రక్షించేందుకు హమమ్ సంస్థ గో సేఫ్ అవుట్‌సైడ్ పేరుతో ఒక పోరాటాన్ని మొదలుపెట్టింది. ఇప్పుడు జరుగుతున్న కుంభమేళాలో ఇలాంటి ఫొటోలు ఎవరికీ చిక్కకూడదనుకుంది. బసంత్ పంచమి రోజు అలహాబాద్‌లో ఈ చీరలు పంచి పెట్టింది. పసుపు రంగుకు ఆకుపచ్చని అంచుతో మెరిసిపోతున్న ఈ వాటర్‌ప్రూఫ్ చీరలు ఆడవాళ్లను తెగ ఆకట్టుకున్నాయి. ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విగ్నంగా తమ పూజలు ముగించుకోవచ్చని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆడవాళ్లకు రక్షణే కాదు.. వారి గౌరవాన్ని పెంచే విధంగా మన పనులుండాలి. మగవాళ్లు కూడా వారి గౌరవానికి భంగం కలిగించే పనులేమీ చేయొద్దని మా విన్నపం అంటూ హమమ్ జనరల్ మేనేజర్ హర్మాన్ థిల్లాన్ ఒక ప్రకటన కూడా చేశాడు.

576
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles