తంగేడు..లాభాలు బోలెడు!


Sun,March 3, 2019 12:54 AM

ముఖారవిందం కోసం నానా తిప్పలు పడుతుంటారు. ఏవేవో క్రీమ్‌లు రాస్తుంటారు. చాలామంది బ్యూటీపార్లర్ల చుట్టూ తిరుగుతుంటారు. కానీ, ఇంటి ఆవరణలో దొరికే వాటితోనే అందాన్ని పొందవచ్చు. అదెలాగో చూద్దాం.
Thangedu
-తంగేడు పువ్వులు ఆరోగ్యానికి, చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. గుప్పెడు తంగేడు పువ్వులను బాగా పేస్టు చేసుకొని ఎండలో ఎండబెట్టాలి. దీన్ని కొబ్బరి నూనెలో వేసి మరిగించాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించడం ద్వారా చుండ్రు సమస్య పోతుంది.
-ముఖంపై ఉన్న మచ్చలను తంగేడు పువ్వుల పేస్టు తొలిగిస్తుంది. అందుకే తంగేడు పువ్వులను పేస్ట్ చేసుకొని ముఖానికి రోజుకోసారి పట్టిస్తే బ్యూటీ పార్లర్లకు వెళ్లాల్సిన అవసరం ఉండదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
-తంగేడు పువ్వులను వెల్లుల్లిపాయలతో కలుపాలి. దీనికి కాస్త కందిపప్పు చేర్చి ఉడికించాలి. ఇలా వారానికి ఓసారి తింటే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. ఆరోగ్యానికీ మంచిది.
-తంగేడు పువ్వులను గ్లాసుడు నీటిలో మరిగించి ఆ నీటిని సేవించడం ద్వారా చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. అంతేకాదు మధుమేహాన్ని కూడా నియంత్రించుకోవచ్చు.
-జుట్టు రాలే సమస్య ఉంటే తంగేడు పువ్వులు, మందార పువ్వులు, కొబ్బరిపాలను సమపాళ్లలో తీసుకొని పేస్టులా చేయాలి. ఈ మిశ్రమాన్ని శిరోజాలకు పట్టించాలి. ఇలా వారానికోసారి చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.

359
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles