డ్రైవర్ లేని బైకులొచ్చాయ్!


Wed,January 2, 2019 01:03 AM

డ్రైవర్ అవసరం లేని కార్లు రోడ్ల మీద తిరుగుతున్న వీడియోలు చూసి ఆశ్చర్యపోయాం. కానీ ఇప్పుడు డ్రైవర్ అవసరం లేని బైకులు కూడా వచ్చేశాయంటే నమ్ముతారా? నమ్మాల్సిందే.. ఎందుకంటే బీఎండబ్ల్యూ డ్రైవర్ అవసరం లేని కొత్త తరం బైకులను రిలీజ్ చేసింది.
bikeR1200
రిమోట్ సెన్సార్‌తో పనిచేసే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బైకులు వాటంతటవే ఎక్కడికైనా వెళ్లిపోగలవు. ఎదురుగా ఏదైనా వాహనం ఉన్నప్పుడు హారన్ కొట్టడం, బ్రేక్ వేయడం, ఆగినప్పుడు స్టాండ్ వేయడం వంటి పనులు కూడా స్వయంగా చేసుకుంటుంది. బైకు వెనుకభాగంలో రోబో మిషన్లు అమర్చారు. మనుషులు నడుపుతున్న వాహనం నుంచి ఏదైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉంటే ముందే పసిగట్టి హెచ్చరిస్తుంది. రక్షిస్తుంది కూడా. బీఎండబ్ల్యూ ఆర్1200 జీఎస్ పేరుతో ఈ బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేశారు. గ్రాడ్యుయేట్ ఇంజినీర్ స్టీఫన్ హాన్స్ ఈ బైక్‌ను రూపొందించాడు. రానున్న రోజుల్లో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతూ మరెన్నో అద్భుతాలు సృష్టించగలదు అన్నదానికి ఇది చిన్న ఉదాహరణ మాత్రమే.

719
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles