డ్రెస్ సెలెక్ట్ చేసే మెషిన్


Wed,February 13, 2019 12:14 AM

కాస్త భిన్నంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. కాకపోతే ఏ సందర్భంలో ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఈ మెషిన్ వచ్చింది.
paris-fashion
చాలామంది డ్రెస్సింగ్ విషయంలో తికమక పడుతూ ఉంటారు. అందరి కంటే అందంగా, భిన్నంగా కనిపించాలని ఆరాటపడుతుంటారు. కాకపోతే డ్రెస్ సెలక్ట్ చేసుకొనే విషయంలో వారికే సరైన క్లారిటీ ఉండదు. అలాంటి వారికోసం జార్జియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సరికొత్త పరికరాన్ని తెచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో రూపొందించిన ఈ పరికరం మనిషిని స్కాన్ చేసి, సందర్భం గురించి చెప్తే చాలు.. ఆ రోజు వాతావరణం, మూడ్, సందర్భాన్ని బట్టి ఉన్న డ్రెస్సుల్లో మనకు బాగా సూటయ్యే డ్రెస్‌ను సెలక్ట్ చేసి పెడుతుంది. ప్రస్తుతం ఈ మెషిన్ టెస్టింగ్‌లో ఉంది. త్వరలోనే మార్కెట్లోకి రానుంది. ఈ మెషిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అందరూ సూపర్ మోడల్స్‌లా తెగ మెరిసిపోతారేమో కదా!

409
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles