డోర్‌మ్యాట్‌ల ఎంపిక ఇలా?


Sat,March 2, 2019 12:00 AM

అందరింట్లో డోర్‌మ్యాట్ ఉండడం సహజం. కానీ ఎలాంటి డోర్ మ్యాట్లు ఎంచుకోవాలో చాలామందికి తెలియదు. ఏ టైల్స్‌కి ఎలాంటి డోర్‌మ్యాట్‌లు బాగుంటాయో తెలియక
తికమక పడుతుంటారు.

door-mat
-పాలరాతి మెరుపులు కలిగిన ఫ్లోరింగ్ చాలామంది ఇంట్లో ఉంటాయి. చిన్నపాటి ఇసుక రేణువులు, మట్టి కారణంగా ఫ్లోరింగ్ పాడై మరకలుగా కనబడుతుంది. దీనికి పరిష్కారంగా గుమ్మం ముందు మెత్తటి డోర్‌మ్యాట్ పరుచుకోవచ్చు.
-బయట తిరిగి వచ్చినా కూడా కాళ్లకున్న దుము,్మ ధూళి ఆ మ్యాట్ పీల్చుకుంటుంది. ఇల్లు శుభ్రంగా ఉండాలంటే కాటన్, మెత్తని డోర్‌మ్యాట్ ఉపయోగించడం మేలు.
-చాలామంది ప్లాస్టిక్ డోర్‌మ్యాట్లను ఉపయోగిస్తుంటారు. వీటివల్ల ప్రయోజనం లేదు. ప్లాస్టిక్ డోర్‌మ్యాట్లు తడిని పీల్చుకోలేవు. దుమ్మును ఆపలేవు. వీలైనంతం వరకు బట్టతో చేసిన డోర్‌మ్యాట్లను ఎంచుకోవడం మంచిది.
-డోర్‌మ్యాట్లు కొనాలన్నా, వాటిని ఉపయోగించాలన్నా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు గుమ్మం ముందు నార సంచులు కూడా ఉపయోగించవచ్చు. పాత జీన్‌ప్యాంట్లు, చొక్కాలు మ్యాట్‌లా కుట్టి ఉపయోగించుకోవచ్చు.
-డోర్‌మ్యాట్‌లు ఎంతో డబ్బు వెచ్చించి కొన్నా పాడైపోతున్నాయా? అయితే ఇంట్లోని పాత చీరలను అరచేతి వెడల్పుతో నిలువుగా కట్ చేసుకొని గుండ్రగా తాడులా చేసుకోవాలి. ఆ తర్వాత వీటిని ఒక్కొక్కటిగా అతికించి ఏ విధంగా కావాలంటే ఆ ఆకృతిలో కుట్టుకోవాలి.

280
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles