డైలీ డంప్ కంపోస్టర్!


Mon,March 11, 2019 12:48 AM

టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా.. మనోళ్ల ఆలోచనలు ఇంకా చెత్త బుట్ట దగ్గరే ఆగుతున్నాయి. కారణం.. పరిశుభ్రతపై అవగాహన లేకపోవడమే. వ్యర్థ పదార్థాలను ఎలా ఉపయోగించాలో తెలియకపోవడమే. ఈ సమస్యకు ఓ పరిష్కారంతో వచ్చింది ఈ పడతి.
poonam
బెంగళూర్‌కు చెందిన ఈ మహిళ పేరు పూనమ్ బిర్ కస్తూరి. నిత్యం ఇంట్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలకు డైలీ డంప్ పేరుతో ఓ అర్థాన్ని ఇస్తున్నది ఈ పడతి. పట్టణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు వ్యర్థాలను ఎరువుగా మార్చి.. ఇంట్లోని మొక్కలకు వేస్తే బాగుంటుందనేది పూనమ్ ఆలోచన. 1984లో చదువు పూర్తయిన తర్వాత ఓ కంపెనీలో ఉద్యోగం చేసింది. ఆ తర్వాత సృష్టి స్కూల్ ఆఫ్ ఆర్ట్, డిజైన్ అండ్ టెక్నాలజీలో టీచర్‌గా పనిచేసింది. రోజూ పుట్టుకొస్తున్న వ్యర్థాలకు పరిష్కారం చూపాలని డైలీ డంప్‌ని మొదలుపెట్టింది. ఈ క్రమంలో కంపోస్టర్ కుండల్ని రకరకాలుగా డిజైన్ చేసింది. వీటిని బాల్కనీలో పెట్టుకొని.. ఇంట్లో ఉత్పన్నమయ్యే వ్యర్థాలను వాటిల్లో వేసుకొని, ఎరువుగా మార్చుకొనే పద్ధతికి శ్రీకారం చుట్టింది.


poonam2
వ్యర్థపదార్థాలను కంపోస్టర్లో వేసి రీమిక్స్ పౌడర్‌తో కలిపి కొన్ని రోజలు ఉంచాలి. దీన్నుంచి ఎటువంటి చెడువాసన రాదు. ఈ చెత్త బుట్ట దాదాపు 60 శాతం సేంద్రియ వ్యర్థాలను తయారు చేస్తుంది. ఇలా తనవంతుగా ఓ పరిష్కారాన్ని ఆవిష్కరించింది పూనమ్. ఈ డైలీడంప్ పద్ధతిని మన దేశంలోని 17 ప్రధాన నగరాల్లో, యూఎస్, దుబాయ్‌ల్లో కూడా వాడుతున్నారు. 13 యేండ్ల నుంచి ఈ విధానంతో ఎంతో మందిలో చైతన్యం కలిగించింది. కంపోస్టర్లను మధురై, ఆంధ్రపదేశ్‌లోని మదనపల్లి, రాజస్థాన్, అస్సోంలోని డుబ్రీ ప్రాంతాల్లో తయారు చేస్తున్నారు.

775
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles