డైనింగ్ టేబుల్ డెకరేషన్ ఇలా...


Fri,February 22, 2019 12:09 AM

ఒకప్పుడు కింద కూర్చుని తినేవారు. ఇప్పుడు ప్రతీ ఇంట్లో డైనింగ్ టేబుల్స్ వచ్చేశాయి. వాటిని కూడా అందంగా డెకరేట్ చేస్తే ఆకలి మరింత పెరుగుతుందట. అందుకే డైనింగ్ టేబుల్‌ని ఆకర్షణగా మార్చేందుకు ఈ చిట్కాలు..
dining-table
-డైనింగ్ టేబుల్ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేట్లు చూసుకోవాలి. ఎక్కువ సామాన్లు లేకుండా నీట్‌గా సర్దుకోవాలి.
-మనసుకు ఆహ్లాదాన్ని అందించేలాగా తాజా పూలను డైనింగ్ టేబుల్‌పై అలంకరిస్తే ఆహ్లాదం కలుగుతుంది. ఒక వేళ పూలు దొరక్కపోయినా తాజా పండ్లను డైనింగ్ టేబుల్ మీద ఉంచినా ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
-డైనింగ్ టేబుల్‌పై పెట్టే భోజన పాత్రలకు సరిపోయే డైనింగ్ కవర్‌ను టేబుల్‌పై వేయండి. తెలుపు రంగులో ఉన్న పింగాణి పాత్రలను వడ్డించే పాత్రలుగా ఎంచుకుంటే చూసేందుకు బాగుంటాయి.
-ఇప్పుడు పెద్ద పరిమాణంలో ఉన్న ప్లేట్లు ఫ్యాషన్. అన్ని హోటళ్లలో నివాసాలలో ఎక్కువగా పెద్ద పరిమాణం ఉన్న ప్లేట్లను వాడుతున్నారు. వీటిలో ఎక్కువగా ఆహార పదార్థాలు పండ్ల ముక్కలు, పచ్చళ్లు పడతాయి.
-తింటూ ఉండగానో, తినే సమయానికి ముందుగానో కరెంటు పోతే క్యాండిల్ వెలిగించి డైనింగ్ టేబుల్‌పై పెట్టి తింటుంటారు. క్యాండిల్ స్టాండ్ లేకుండా పెట్టడం వల్ల డైనింగ్ టేబుల్ పాడయ్యే అవకాశం ఉంటుంది.
-డైనింగ్ టేబుల్‌పై వేడి పదార్థాలను ఉంచిన గిన్నెలను పెట్టకూడదు. డైనింగ్ ప్లేట్లను టేబుల్ మీద పెట్టేటప్పుడు తప్పనిసరిగా మ్యాట్స్‌ను ప్లేట్ అడుగున ఉంచాలి. లేదంటే డైనింగ్ టేబుల్ పాడయ్యే అవకాశం ఉంటుంది.

763
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles