డెవలపర్ల లాభాలు తగ్గేనా?


Sat,March 9, 2019 12:12 AM

overview-banner
కొన్నేండ్ల నుంచి దేశీయ నిర్మాణ రంగం తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నది. జీఎస్టీ రేటును తగ్గిస్తారని ఆశతో ఎదురు చూసిన డెవలపర్లకు కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం మింగుడుపడటం లేదు. జీఎస్టీలో ఏడు శాతం ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను తొలగించడంతో తమ మార్జిన్లు తగ్గిపోతాయని డెవలపర్లు భావిస్తున్నారు. స్థలానికి మూడో వంతుగా జీఎస్టీలో లెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, కొన్ని బడా నగరాల్లో భూమి ధర 40 నుంచి 50 శాతం వరకూ ఉండొచ్చు. అలాంటప్పుడు, తమ మార్జిన్లు దెబ్బతింటాయని బిల్డర్లు చెబుతున్నారు. ఈ లోటును పూడ్చుకోవడానికి కొందరు ఇండ్ల ధరల్ని ఐదు నుంచి ఆరు శాతం వరకూ పెంచే అవకాశముందని నిపుణులు అంటున్నారు. కొన్ని ప్రధాన నగరాల్లో రానున్న రోజుల్లో ఐదు నుంచి పది శాతం దాకా ఫ్లాట్ల రేట్లు పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని అభిప్రాయపడుతున్నారు. అయితే, రేటు పెంచితే కొనుగోలుదారులు ముందుకొస్తారా? అనేది మళ్లీ సందేహమే! మొత్తానికి, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ తొలగింపు వల్ల డెవలపర్లు కొంత వ్యతిరేకంగా ఉన్నారని సమాచారం. ఒక్కో ప్రాజెక్టు మీద 15 నుంచి 20 శాతం దాకా ఉన్న మార్జిన్లు 5 నుంచి 10 శాతానికి తగ్గతుందని చెబుతున్నారు.

229
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles