డీ విటమిన్ లోపం ఉంటే ప్రెగ్నెన్సీ కష్టమా?


Fri,January 25, 2019 02:06 AM

నా వయసు 37 సంవత్సరాలు. మాకు రెండేండ్ల పాప ఉంది. నాకు ఈ రెండేళ్లలో రెండుసార్లు ప్రెగ్నెన్సీ వచ్చింది. కానీ కనీసం రెండేండ్లు ఎడం ఉండాలని నియంత్రణలు పాటించాం. ఇప్పుడు పిల్లలు కావాలనుకుంటున్నాం. కానీ కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే జీవనశైలి మార్చుకోమన్నారు. ముఖ్యంగా డీ విటమిన్ లోపం ఉందని చెప్పారు. డీ విటమిన్ లోపం ఎందుకు ఏర్పడుతుంది? దీనిని ఎలా భర్తీ చేయాలి? ప్రెగ్నెన్సీ రావడానికి ఈ సమస్య ఆటంకం కలిగిస్తుందా తెలియజేయగలరు.
- ఎస్. శ్యామల, పీర్జాదిగూడ, హైదరాబాద్

Councelling
శ్యామలగారూ.. విటమిన్ డీ లోపం ఇండియాలో ఒక సాధారణ సమస్యగా మారిపోతున్నది. ఎముకల్లో ఖనిజ సాంద్రత తగ్గడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. మీరు తెలిపిన లక్షణాలను పరిశీలిస్తే.. తరుచూ ప్రెగ్నెన్సీ రావడం వల్ల ఈ సమస్య ఏర్పడిందని చెప్పవచ్చు. పిల్లల మధ్య వయసు వ్యత్యాసం లేకపోవడం వల్ల కూడా డీ విటమిన్ లోపం ఏర్పడుతుంది. కానీ ఈ ఒక్క సమస్యతోనే మీకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావడం లేదని మాత్రం నిర్ధారించలేం. దీనికి తోడు ఇంకేవో కారణాలు ఉండొచ్చు. ఏది ఉన్నా పరీక్షలు చేసిన తర్వాతనే చెప్పవచ్చు. అయితే జీవనశైలిలో మార్పులు.. పోషకాహారం తీసుకోవడం వల్ల డీ విటమిన్ సమస్యను అధిగమించవచ్చు. ఇంట్లోనే ఎక్కువగా గడపడం కాకుండా కనీసం ఎండ తగిలే సమయంలోనైనా బయటకు వస్తే ఈ సమస్యను అధిగమించవచ్చు. ఈ సమయంలో సన్‌స్క్రీన్ రాసుకోవద్దు. చేతులు.. ముఖంపై ఏమీ కప్పుకోవద్దు. ఎండ తగిలితే విటమిన్ డీ లోపాన్ని అధగమించే అవకాశాలు చాలా ఉన్నాయి. నిశ్చింతగా ఉండండి. ఇది పెద్ద ప్రమాదకరమైన సమస్యేం కాదు.

డాక్టర్ జీ వింధ్య
కన్సల్టెంట్ గైనకాలజిస్ట్
కేర్ హాస్పిటల్స్. హైటెక్‌సిటీ

909
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles