డయాబెటిస్.. ఇక భయం లేదు!


Wed,September 7, 2016 01:26 AM

మన శరీరంలో ఉపయోగపడకుండా మిగిలిపోయిన చక్కెర పదార్థాల మోతాదు సాధారణ స్థితి కంటే ఎక్కువగా రక్తంలో ఉండటాన్ని డయాబెటిస్ అంటారు. ఇది ఒక మెటబాలిక్ డిజార్డర్.

డయాబెటిస్ - రకాలు


డయాబెటిస్ ఎక్కువగా 30 ఏళ్లు దాటినవారిలో వస్తుంది. దీనికి రెండు కారణాలు.
1. అవసరమైన మోతాదులో ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం.
2. శరీరంలోని కణజాలం ఇన్సులిన్‌ను ఉపయోగించుకోలేకపోవడం. ఇది శారీరక శ్రమ తక్కువగా ఉండి, మానసిక ఒత్తిడి అధికం గలవారిలో, ఎక్కువగా రాత్రివేళలో ఉద్యోగాలు చేసేవారైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, కాల్‌సెంటర్‌లో, మార్కెటింగ్‌లో పనిచేసేవారిలో త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది.
తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఈ వ్యాధి ఉంటే వారి సంతానానికి, స్థూలకాయం ఉన్నవారు కూడా ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

కారణాలు


శారీరక శ్రమ తక్కువగా ఉండి, మానసిక ఒత్తిడి అధికంగా ఉండడం, శరీరంలో తక్కువ మోతాదులో ఇన్సులిన్ ఉత్పత్తి కావడం. ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్‌ను శరీరంలోని కణజాలాలు సంపూర్ణంగా ఉపయోగించుకోకపోవడం (ఇన్సులిన్ రెసిస్టెన్స్)
వంశపారంపర్య కారణాలు. తల్లిదండ్రుల్లో ఉంటే సంతానానికి ఈ జబ్బు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్థూలకాయం. బిఎంఐ 30 కంటే ఎక్కువగా ఉన్నవారిలో డయాబెటిస్ అవకాశాలు ఎక్కువ. ఆటో ఇమ్యూన్ డిసీజ్ వలన టైప్ 1 డయాబెటిస్ వస్తుంది.
క్లోమగ్రంథి సిస్టిక్ ఫైబ్రోసిస్ వల్ల వస్తుంది. క్రానిక్ పాంక్రియాటైటిస్, పార్షియల్ పాంక్రియాడక్టమీ. కొన్నిసార్లు ఎలాంటి కారణాలు లేకుండా కూడా రావచ్చు.

లక్షణాలు


దాహం, ఆకలి, మూత్రం ఎక్కువగా ఉండడం. బరువు తగ్గడం, త్వరగా నీరసపడడం. పిక్కల్లో నొప్పి, ఒంటినొప్పులు, గాయాలు నయం కాకపోవడం, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు, చర్మవ్యాధులు, కాళ్లూచేతులు తిమ్మిర్లు, లైంగిక వాంఛలు తగ్గిపోవడం
diabetes

కాంప్లికేషన్స్


షుగర్ ఉన్నవారు సరైన చికిత్స, జీవనవిధానం లోపిస్తే ఇతర సమస్యలకు లోనవుతారు. వాటిలో కొన్ని..
డయాబెటిక్ ఫూట్, డయాబెటిక్ నెఫ్రోపతి, డయాబెటిక్ రెటినోపతి, డయాబెటిక్ న్యూరోపతి, బీపీ, కొలెస్ట్రాల్ లెవల్స్ పెరగడం, ఛాతినొప్పి, గుండెపోటు, పక్షవాతం, కాటరాక్ట్, గ్యాస్ట్రిక్ సమస్యలు

రోగనిర్ధారణ


పాస్టింగ్ బ్లడ్ షుగర్ (ఎఫ్‌బీఎస్), పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ (పీపీబీఎస్), హెచ్‌బీఏవన్‌సీ, గ్లూకోజ్ టాలరెంట్ టెస్ట్ (జీటీటీ), యూరిన్ షుగర్ లెవల్, రాండమ్ షుగర్ లెవల్స్ (ఆర్‌బీఎస్), వీటితో పాటు బ్లడ్ యూరియా, సీరమ్ క్రియాటినిన్, కొలెస్ట్రాల్ టెస్టులు చేయిస్తే కచ్చితమైన చికిత్స అందించవచ్చు.

హోమియోచికిత్స


జెనెటిక్ కాన్‌స్టిట్యూషన్ విధానం ద్వారా వ్యక్తిలోని డయాబెటిస్ జబ్బుని కాదు, జబ్బుతో ఉన్న వ్యక్తికి ట్రీట్‌మెంట్ చేయడం ద్వారా కాంప్లికేషన్స్ రాకుండా చూడవచ్చు. డయాబెటిస్ గుర్తించిన వెంటనే హోమియోపతి వైద్యంతో సంపూర్ణంగా నయం చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చిన్న వయసులో అధిక ఒత్తిడి వల్ల వచ్చే స్ట్రెస్ డయాబెటిస్‌ను సంపూర్ణంగా నయం చేయవచ్చు.
Srikanthm

1762
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles