డయాబెటిక్ న్యూరోపతికి హోమియో


Tue,July 11, 2017 12:10 AM

రక్తంలో షుగర్ స్థాయి నియంత్రణలో లేకపోతే దాని ప్రభావం శరీరంలోని మిగిలిన ప్రధాన అంగాలన్నీ తమ సమతుల్యతను కోల్పోతాయి. గుండె, మెదడు, కళ్లు, మూత్ర పిండాలు, పాదాలు, నాడులు షుగర్ ప్రభావానికి లోనవుతాయి. శరీరంలోని క్లోమ గ్రంథి నుంచి ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఆహారంలోని పిండిపదార్థాలు రక్తంలో షుగర్ రూపంలో ఉండి శరీర కణాలకు, అంగాలకు సరఫరా జరిగి శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తాయి. ఈ క్రియకు ఇన్సులిన్ సహకరిస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తి తగినంత లేనపుడు రక్తంలోని చక్కెర శరీరంలోని కణాలకు చేరకుండా రక్తంలోనే ఉండిపోయి రక్తంలో షుగర్ స్థాయి పెరిగి పోతుంది. ఈ స్థితినే మధుమేహం లేదా డయాబెటిస్ అంటారు. దీనివల్ల రెండు రకాల నష్టాలు- తిన్న ఆహారం నుంచి శరీర అవయవాలకు శక్తి రవాణా జరుగదు. రెండవది రక్తంలో గ్లూకోజ్ స్థితి మారిపోతుంది.
canstock

రకాలు


-టైప్ 1 -దీన్ని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ అంటారు. ఇది ఏ వయసులోనైనా రావచ్చు. కానీ ఎక్కువగా పిల్లల్లో కనిపిస్తుంది. క్లోమగ్రంథి పూర్తిగా దెబ్బతిని ఇన్సులిన్ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోతుంది. కాబట్టి ఇన్సులిన్‌ను ఇంజక్షన్ల రూపంలో జీవితాంతం వాడాల్సి ఉంటుంది.
-టైప్ 2 - ఈ డయాబెటిస్‌లో క్లోమం నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. కానీ, ఇది క్రీయాశీలంగా ఉండదు. కణాలకు చేరాల్సిన షుగర్ రక్తంలో ఉండిపోతుంది. ఇది ఎక్కువగా మధ్య వయసు నుంచి కనిపించే సమస్య.
-జెస్టేషనల్ డయాబెటిస్ - గర్భం దాల్చినపుడు మొదటిసారిగా ఈ లక్షణాలు కనిపిస్తాయి. రక్తంలో షుగర్ నియంత్రించేందుకు ఇన్సులిన్ వాడుతూ ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. ప్రసవం తర్వాత తగ్గిపోతుంది. కొందరిలో టైప్ 2 డయాబెటిస్‌గా కొనసాగుతుంది.
డయాబెటిక్ న్యూరోపతి
-డయాబెటిస్‌లో సాధారణం గా కనిపించే దుష్ప్రభావం నాడుల మీద ఉన్నపుడు దాన్ని న్యూరోపతి అంటారు.
-న్యూరోపతి 2 రకాలు - కాళ్లకు చేతులకు వచ్చే పెరీఫెరల్ న్యూరోపతి. జీర్ణవ్యవస్థకు, మూత్రవిసర్జన వ్యవస్థకు, రక్తనాళాలకు వచ్చే అటోనామిక్ న్యూరోపతి. గ్లూకోజును ఎప్పటికప్పుడు అదుపులో ఉంచుకోవడం ద్వారా రాకుండా నియంత్రించవచ్చు.
జీర్ణవ్యవస్థకు సంబంధించిన న్యూరోపతి
-తేన్పులు, మలబద్దకం, గుండెల్లో మంట, వాంతులు, అన్నం తినగానే కడుపు ఉబ్బరంగా ఉండడం
రక్తకణాలకు సంబంధించిన న్యూరోపతి
-లేచి నిలబడగానే కళ్లు బైర్లు కమ్మడం, గుండె వేగంగా కొట్టుకోవడం, లో బీపి
లైంగిక న్యూరోపతి
-అంగస్తంభనలు లేకపోవడం, కడుపు ఉబ్బరం, మూత్రవిసర్జన మీద అదుపుకోల్పోవడం, రాత్రుళ్లు మాటిమాటికీ మూత్రవిసర్జన చెయ్యాల్సి రావడం
reddy
నిర్ధారణ
-ఎఫ్‌బీఎస్, ఎఫ్‌ఎల్‌బీఎస్, హెచ్‌బీ ఏ/సి పరీక్షలతో వ్యాధిని నిర్ధారించవచ్చు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
-కుటుంబ చరిత్రలో డయాబెటిస్ ఉన్నవారు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యాలి. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. మధ్య వయసుకు వచ్చిన వారు ప్రతి 3 నెలలకు ఒకసారి పరీక్షలు చేయించుకోవాలి. పాదాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏ విధంగా దెబ్బలు తగులకుండా చూసుకోవాలి.
హోమియో వైద్యం
-పాజిటివ్ హోమియోపతిలో డయాబెటిస్‌కు చాలా అద్భుతమైన వైద్యం అందుబాటులో ఉంది. ముఖ్యంగా టైప్2 డయాబెటిస్‌తో వచ్చే దుష్ప్రభావాలు సులభంగా అధిగమించవచ్చు. కాన్‌స్టిట్యూషనల్ సిమిలిమం ద్వారా ఇచ్చే మందుల ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.

298
Tags

More News

VIRAL NEWS

Featured Articles