ట్వీట్


Sun,February 17, 2019 01:32 AM

కృతి సనన్@kritisanon
tweet
మీ ప్రార్ధనలు ఒక్కటే సరిపోవు. ధైర్యవంతులైన వీరుల కుటుంబాల్లో ధైర్యం నింపాలంటే మనవంతుగా సాయమందించాలి. బాధల్లో ఉన్న ఆ కుటుంబాలకు ఆసరాగా నిలబడాలి. ఎంతో కొంత ఆర్ధికంగా ఆదుకుందాం. ప్రతి రూపాయి పరిగణలోకి తీసుకోబడుతుంది. https://bharatkeveer.gov.in సైట్‌కి లాగిన్ అవండి.

కృతి సనన్‌ను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 45,02,885

కామన్‌మ్యాన్ వాయిస్

అరె ఓ ముష్కర కుక్కల్లారా మీరు మా జవాన్లను దొంగదారిన సంపినప్పుడే మీ ముక్కిపోయిన మైండ్‌సెట్ అర్ధమైంది. మీకు దమ్ముంటే ఎదురుగా వచ్చి కొట్లాడాలి రా అప్పుడు తెలుస్తుండే మా జవానుల పనితనం.
-Khaja Afridi

యుద్ధంలో నష్టం ఉంటుంది. లాభం ఉంటుంది. యుద్ధం లక్ష్యం, వ్యూహంలో బలయ్యేది సైనికులు, సామాన్యులే. యుద్ధం ఎవరివల్ల, ఎందుకు, ఎవరికోసం లాంటివి అర్థం అయ్యి అర్థం కానితనంతో మనల్ని కన్యూజ్ చేస్తూనే ఉంటాయి. వాళ్ల కుటుంబాలకు న్యాయం జరుగాలని కోరుకుంటున్నా.
-Akshara Kumar

ఇంకో ఐదు, ఆరు రోజుల వరకు ఏ కామెడీ పోస్టులు పెట్టను. కామెడీ చేయను. వీలైతే మీరు కూడా పెట్టకండి. కామెడీ చేయకండి.
-Vanaja Srinivas

వైరల్ వీడియో


అదృశ్య శక్తులు మాయలు చేస్తే.. ఏదో గుర్తు తెలియని రూపం ఒక్కటి వెంటాడి వేధిస్తుంటే.. అదే శత్రువుగా మారి ఆటాడిస్తుంటే.. ఒక క్రైమ్ మెంటాలిటీ ఎలా స్పందిస్తుంది. 118 పేరుతో వస్తున్న ట్రైలర్‌లో ఇలాంటి ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తున్నాయి. మీరూ ఓ లుక్కేయండి.
118 Theatrical Trailer | Nandamuri Kalyan Ram, Nivetha Thomas, Shalini Pandey
Total views : 2,313,042+
Published on Feb 15, 2019

357
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles