ట్రెక్కింగ్ గైడ్ హఫీదా!


Mon,March 11, 2019 12:44 AM

పర్వతారోహణ అనేది చాలా కష్టమైన ప్రక్రియ. దీనిలోఎన్నో రకాల అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. సాధారణంగా ఈ రంగంలో ఎక్కువగా పురుషులే ఉంటారు. అయితే మొరాకోలోని పది మంది మహిళా ట్రెక్కింగ్ గైడుల్లో ఒకరిగా గుర్తింపు పొందింది ఈ మహిళ.
guide
ఈమె పేరు హఫీదా డౌబానె. 1994లో శిక్షణ పూర్తి చేసి మొరాకోలోనే మొదటి మహిళా గైడ్‌గా గుర్తింపు పొందింది. పది మంది మహిళా ట్రెక్కింగ్ గైడుల్లో ఒకరు. హఫీదా డిప్లొమా పూర్తి చేసింది. ఆ తర్వాతే ట్రెక్కింగ్ గైడింగ్ వైపు అడుగులు వేసింది. ఈ విధంగా శిక్షణ ఇచ్చే వారిలో ఏకైక మహిళ హఫీదానే. దీంతో అక్కడికి వచ్చినా వారందరూ మాకు గైడ్ నువ్వా అని ఆశ్చర్యపోయేవారు. హఫీదా కేవలం మహిళల బృందాలకే యాత్రలు ఏర్పాటు చేస్తుంది. పర్యాటక గైడ్ పరీక్ష మహిళలకు సులభంగా చేయడానికి జైనా బెంచీక్ చాలా ప్రయత్నం చేశారు. మహిళా గైడ్ ఉండడం వల్ల అక్కడి యాత్రకు వచ్చిన వారి అవసరాలు తెలుసుకోవడానికి, మాట్లాడడానికి అవకాశం ఉండేది. మొరాకోలో లింగవివక్ష ఎక్కువగా ఉంటుంది. అక్కడి గ్రామీణ ప్రాంతంలో 80 శాతం మహిళలు నిరక్షరాస్యులే. యాత్రలో భాగంగా మధ్యలో గ్రామాల్లో దిగుతుండేవారు. అక్కడి ప్రజలతో కాసేపు మాట్లాడేది హఫీదా. పిల్లలను చదివించమని వారి తల్లిదండ్రులకు చెప్పేది. మనమంతా కలిసి చదువుకుందాం. మనం ఏదైనా సాధించగలం అని చెబుతుంది హఫీదా. ఇదంతా సరదాగా చెప్పింది కాదు. వారి జీవితాలు మారాలి. నేనింకా ఇక్కడే ఉన్నా. ఇక్కడే ఉంటాను కూడా. చనిపోయే వరకు పర్వతాలు ఎక్కుతూనే ఉంటా అని చెబుతున్నది హఫీదా.

411
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles