ట్రాష్‌ట్యాగ్ చాలెంజ్!


Wed,March 13, 2019 01:12 AM

పర్యావరణాన్ని పరిరక్షించేందుకు సోషల్‌మీడియాలో మరో ఉద్యమం పుట్టుకొచ్చింది. ట్రాష్‌ట్యాగ్ పేరుతో జరుగుతున్న ఆ ఉద్యమ వివరాలివి..
trashtag
ప్లాస్టిక్ భూతాన్ని అంతమొందించాలని ఎన్ని ఉద్యమాలు జరుగుతున్నా మార్పు అంతంత మాత్రంగానే ఉంటుంది. నివారించడం తప్ప ఇంకో అవకాశం లేదు. ఈ అంశం మీద ఇప్పుడిప్పుడే జనాల్లో కొంత మార్పు వస్తున్నది. పర్యావరణ పరిరక్షణ కోసం ఒక అడుగు ముందుకు వేసి కదులుతున్నారు కొందరు. ట్రాష్‌ట్యాగ్(#trashtag) పేరుతో సోషల్‌మీడియాలో పెద్ద ఉద్యమమే జరుగుతున్నది. ఈ ప్రచార ఉద్యమ ముఖ్య నేపథ్యం మన చుట్టుపక్కన ఉన్న పరిసరాలను శుభ్రం చేయడం. ఖాళీగా ఉన్న టీనేజర్స్ ఈ చాలెంజ్‌ను స్వీకరించాలి. మన చుట్టు పక్కన ఎక్కడైనా ఎక్కువ చెత్తగా ఉన్న ప్రదేశానికి వెళ్లి దాన్ని ఒక ఫొటో తీయాలి. ఆ తర్వాత ఆ ప్రదేశాన్ని మొత్తం పరిశుభ్రంగా చేసి సంచుల్లో నింపిన చెత్తతో మరో ఫొటో తీసుకోవాలి. అంతే.. చాలెంజ్ పూర్తయినట్టే. అంతకు ముందు, ఆ తర్వాత తరహాలో చిత్రాన్ని డిజైన్ చేసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తే ఈ చాలెంజ్ పూర్తయినట్టు. ప్లాస్టిక్ కాలుష్యం వల్ల పర్యావరణమంతా తీవ్రంగా నష్టపోతున్నది. చిన్న చిన్న దేశాల నుంచి మొదలైన ప్లాస్టిక్ రహిత సమాజ ఉద్యమం ఐక్యరాజ్య సమితి వరకు చేరింది. అన్ని దేశాల ప్రతినిధులు ముక్తకంఠంతో ప్లాస్టిక్ రహిత సమాజాన్ని చేయాలని ప్రతిజ్ఞ కూడా చేశారు. కానీ, అది అమలులో విఫలమవుతున్నది. అందుకు కారణం ప్రజలు. వినియోగదారులుగా ప్లాస్టిక్‌ను ప్రజలే ముందు నిషేధించాలి. అలా చేస్తే గానీ ప్రభుత్వాల్లో మార్పు రాదు. ప్లాస్టిక్ ఇప్పుడు చిన్న సమస్యే కావొచ్చు. కానీ, భవిష్యత్తులో ఇదొక మహమ్మారిలా మారి తర్వాత వచ్చే తరాలకు ప్రమాదంగా మారుతుంది. ఈ ఉద్యమంలో భాగంగా అడవులు, బీచ్‌లు, వ్యవసాయ భూములు, రోడ్ల పక్కన ఉండే స్థలాలు ఇలా అన్నిచోట్లా ఈ చాలెంజ్ పడుతున్నారు. ఈ ఉద్యమం మొదట 2015 సంవత్సరంలో యూసీఓ అనే అంతర్జాతీయ సంస్థ ద్వారా ప్రారంభమయింది. ఆ తర్వాత కొంత మందగించినా మళ్లీ ఇప్పుడు ఊపందుకున్నది. ముఖ్యంగా భారత్, నార్వే, థాయ్‌లాండ్‌లో ఈ చాలెంజ్‌కు మంచి స్పందన లభిస్తున్నది.

377
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles