టైల్స్ మెరువాలంటే?


Wed,March 13, 2019 01:13 AM

TILES
-ఒక బకెట్ నీటిలో అరటితొక్కలను వేసి రాత్రంతా ఉంచి.. ఉదయం పూట ఆ తొక్కలను పారవేసి, ఆ నీటితో టైల్స్‌ను శుభ్రం చేస్తే టైల్స్ మెరిసిపోతాయి.
-కిచెన్‌లో తరచూ ఏదో ఒకటి కింద పడిపోతూ ఉంటుంది. దాని వల్ల కిచెన్‌లోని టైల్స్ పాడవుతుంటాయి. అందుకని ఒక స్పూన్ డెటాల్, ఒక స్పూన్ నిమ్మరసం, రెండు స్పూన్ల డిటర్జెంట్ పౌడర్ కలిపి కిచెన్ టైల్స్‌ను తుడిస్తే అవి శుభ్రంగా ఉండడమే కాదు తళతళా మెరుస్తాయి.
-వాష్ బేసిన్స్, టాయిలెట్స్ మొదలైనవి క్లీన్ చేయాలంటే సగం బ్లీచింగ్ పౌడర్, సగం ముగ్గుపిండి కలిపి దానితో శుభ్రంగా తోమి కడిగితే కొత్త వాటిల్లా తెల్లగా మెరుస్తాయి.
-తలస్నానం చేశాక కుంకుడుకాయ తొక్కలను లేదా షాంపు కవర్లు నీటికి అడ్డం పడకుండా ఎప్పటికప్పుడు తీసివేస్తూ ఉంటే మంచిది. బాత్ రూమ్‌లోని హ్యాంగ్లర్‌కు బట్టలను ఎక్కువ సేపు ఉంచకుండా ఎప్పటికప్పుడు ఉతికితే మంచిది.
-బాత్‌రూమ్‌లోని పవర్, కొళాయిలు, ఇంకా వేరే ఫిట్టింగులు తళతళా మెరువాలంటే కిరోసిన్ తడిపిన బట్టలతో తుడవండి. కిరోసిన్ వాసన ఒక గంటలో పోతుంది. బాత్‌రూమ్‌లో విడిచిన బట్టలు అలాగే ఉంచితే బొద్దింకలు, దోమలు చేరుతాయి. ఎప్పటికప్పుడు విడిచిన బట్టలు ఒక పెట్టెలో వేసి ఉంచాలి.

444
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles