టూత్‌పేస్ట్ ఎంత వాడాలి?


Sat,February 16, 2019 01:35 AM

బ్రష్ చేయడానికి ఎంత టూత్‌పేస్ట్ వాడాలో ఏనాడైనా ఆలోచించారా? ఎంత పడితే అంత పేస్ట్ వాడితే పిల్లలు రోగాల బారిన పడుతారు. ఎంత మోతాదులో వాడాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.
Tooth-paste
టూత్‌పేస్ట్ గురించి బహుశా ఎవరూ ఆలోచించి ఉండరు. కానీ, ఆలోచించాలి. పేస్ట్ ఎక్కువయితే దంతాల ఆరోగ్యం కూడా పాడవుతుంది. ఇది ఎవరో చెప్తున్నది కాదు. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ జరిపిన అధ్యయనంలో తేలింది. అమెరికన్ డెంటల్ అసోసియేషన్ కూడా ఇదే చెబుతున్నది. మూడు నుంచి ఆరేండ్ల లోపు పిల్లలు బఠాణీ సైజుకి మించి పేస్ట్ వాడకూడదు. సాధారణంగా పిల్లలు బ్రష్‌లపై ఎక్కువ పేస్ట్ వేస్తుంటారు. దీనివల్ల చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొత్తగా దంతాలు వచ్చే సమయంలో డెంటల్ ఫ్లోరోసిస్‌కు దారి తీసే ప్రమాదముంది. దీంతో పిల్లల దంతాల రంగు మారిపోతుంది. వెంటనే చికిత్స తీసుకోకపోతే దంతాలు పుచ్చిపోతాయి. టూత్‌పేస్ట్‌లో ఫ్లోరైడ్ ఉంటుంది. తగినంత పేస్ట్ తీసుకుంటే దంతాలను కాపాడుతుంది. ఎక్కువైతే హాని చేస్తుంది. పిల్లలే కాకుండా పెద్దలు కూడా తగిన మోతాదులోనే పేస్ట్ వాడాలి.

370
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles