టాటా ఏఐఏ నుంచి సింగిల్ ప్రీమియం పాలసీ


Sat,January 5, 2019 01:08 AM

TATA-AIA-Life
ప్రైవేట్ బీమా రంగంలో అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న సంస్థల్లో ఒకటైన టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ..సింగిల్ ప్రీమియం పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒకేసారి చెల్లింపులు జరిపే ఈ ప్లాన్‌తో ఎలాంటి పెట్టుబడుల రిస్క్ ఉండదని, పదవీ విరమణ చేసిన తర్వాత వార్షిక రిటర్నులు పొందే అవకాశాన్ని ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ పాలసీ తీసుకోవడానికి కనీస వయస్సును 45 ఏండ్లుగా నిర్ణయించిన సంస్థ..ఒకేసారి కనిష్ఠంగా రూ.4,79,622 చెల్లించాల్సి ఉంటుంది. గరిష్ఠంగా ఎంతైన చెల్లించుకోవచ్చును. ఈ పాలసీ తీసుకున్నవారికి ఆదాయ పన్ను చట్టం 80సీసీసీ కింద పన్ను రాయితీ లభిస్తున్నది. పదవీ విరమణ చేసిన తర్వాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఈ పాలసీ తీసుకుంటే సరిపోతుందని కంపెనీ చీఫ్ రిస్క్ అధికారి సమిత్ ఉపాధ్యాయ తెలిపారు.

364
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles