టర్మ్ పాలసీలకే ఆదరణ ఎక్కువ


Sat,December 29, 2018 12:26 AM

-ఏగాన్ లైఫ్ సీఎఫ్‌ఓ రాజీవ్ చుఘ్
tarm-palacy
హైదరాబాద్ వాసులు సంప్రదాయ పాలసీల కన్నా టర్మ్ పాలసీలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏగాన్ లైఫ్ ఇన్సూరెన్స్ సీఎఫ్‌ఓ రాజీవ్ చుఘ్ తెలపారు. ముఖ్యంగా 65 శాతం మహిళలు టర్మ్ పాలసీలను తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారని ఆయన తెలిపారు. దీనికి తోడు 25 నుంచి 45 ఏండ్లలోపు వారు దాదాపు 80 శాతం మంది కూడా టర్మ్ పాలసీలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన వెల్లడించారు. ఏగాన్ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి కొత్తగా పీఓఎస్ గ్రిప్ పాలసీని ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. పూర్తిగా ఆన్‌లైన్‌లోనే లభిస్తుందని తెలిపారు. తమ పాలసీలను అత్యధికంగా హైదరాబాదీయులే ఆదరిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 50 పాలసీలను ప్రవేశపెట్టినా ప్రస్తుతానికి 21 పాలసీలే విక్రయిస్తున్నామని తెలిపారు. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ 140 కోట్ల కొత్త ప్రీమియంను వసూలు చేసినట్టు తెలిపారు.
rajiv-chugh
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బీమా రంగం 9.5 శాతం మాత్రమే వఋద్ధి చెందిందని, దేశంలో ఇప్పటికీ తక్కువ మొత్తాలకే బీమా పాలసీ తీసుకుంటున్నారనీ, ఇంకా బీమా తీసుకోని వారి సంఖ్య అధికంగా వున్నారని తెలిపారు. బీమా పై పెరుగుతున్న అవగాహన నేపథ్యంలో వచ్చే ఏడాదిలో వఋద్ధి పుంజుకోగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. బీమా ఉత్పత్తలను మార్కెట్ చేసేందుకు ప్రస్తుతం ఉన్న 50 సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోగా, వచ్చే ఏడాది మరిన్ని సంస్థలతో ఒప్పందాలను కుదుర్చుకోనున్నట్టు ఆయన తెలిపారు.

422
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles