టచ్ చేసే.. స్మార్ట్‌వాచ్!


Wed,September 5, 2018 03:12 AM

ఇప్పటి వరకూ లేని ఫీచర్లతో, సరికొత్త సౌకర్యాలతో డీజిల్ సరికొత్త స్మార్ట్‌వాచ్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఆ స్మార్ట్‌వాచ్ ఫీచర్లు ఇలా ఉన్నాయి.
watch
స్మార్ట్‌వాచ్ అంటే ఇప్పటి వరకు మనం వేసే అడుగులు లెక్కపెట్టడం, ఎన్ని కేలరీలు ఖర్చయ్యాయో నమోదు చేయడం, మొబైల్‌కి వచ్చే కాల్స్, మెసేజ్‌లు చూసుకునే సౌకర్యం ఉండేది. డీజిల్ మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్‌వాచ్‌లో స్క్రీన్‌టచ్ సౌకర్యం ఉంది. రాపిడ్ చార్జింగ్, మ్యూజిక్ కంట్రోల్, కస్టమైజ్డ్ వాచ్ టైప్, స్మార్ట్‌ఫోన్ నోటిఫికేషన్స్ ఇలా ఎన్నో ఆకట్టుకునే ఫీచర్లున్నాయి. 1:39 అంగుళాలతో, 454x454 పిక్సెల్స్ రిజల్యూషన్ టచ్‌స్క్రీన్ ఈ స్మార్ట్‌వాచ్‌లోని ప్రత్యేక ఫీచర్. 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 512 ర్యామ్‌తో జీపీఎస్ ట్రాకింగ్ సౌకర్యం కూడా ఉంది. వాటర్‌ప్రూఫ్, వెదర్ అప్‌డేట్స్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇంతకీ ఈ స్మార్ట్‌టచ్ వాచ్ ధరెంతో తెలుసా? అక్షరాలా 24, 495 రూపాయలు. నాలుగు మోడల్స్‌లో తయారుచేశారు. కావాల్సిన వాళ్లు ఆన్‌లైన్‌లో డీజిల్ వెబ్‌సైట్‌లో ఆర్డర్ చేయండి.

730
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles