జుట్టు పొడిబారకుండా..


Mon,December 31, 2018 01:01 AM

చలికాలంలో.. తేమ తక్కువగా ఉంటుంది. దీంతో తల పొడిబారి దురద పెడుతుంది. దాని కారణంగా చుండ్రు సమస్య వచ్చి పడుతుంది. కాబట్టి.. ఈ కాలంలో వారానికి ఒకసారైనా తలకు నూనె రాయాలి. కొబ్బరినూనెలో కొద్ది నిమ్మరసం కలిపి.. వేడి చేసుకొని తర్వాత దానిని తలకు పట్టించి మర్దన చేయాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి.
indian-hairstyles
మరో సమస్య.. జట్టు ఎండుగడ్డిలాగా మారడం. అలాంటప్పుడు గుడ్డులోని తెల్లసొనలో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి తలంతా రాయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. జుట్టు నిగనిగలాడుతుంది.తలస్నానం చేసిన తర్వాత కండిషనర్ వాడటం మర్చిపోవద్దు.. కండిషనర్ వాడటం కారణంగా జట్టు పొడిబారే సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా అరటిపండు గుజ్జులో ఆలివ్ నూనె కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే.. జుట్టు ఆరోగ్యంగా పట్టుకుచ్చులా మెరుస్తుంది.

358
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles