జుట్టు పాడవ్వకుండా ఉండాలంటే!


Sat,December 29, 2018 12:54 AM

మహిళలు, పురుషులు జట్టు విషయంలో జాగ్రత్త వహించకుంటే తరువాత బాధపడాల్సి వస్తుంది. ఈ సమస్య పరిష్కారానికి ఈ చిట్కాలు పాటించండి.

haircare
-ఆలివ్ నూనె, లెమన్‌గ్రాస్ నూనె, ఆముదం, కొబ్బరి నూనెలన్నింటినీ వేసి బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని చేతివేళ్లతో జుట్టుకు పట్టిస్తూ ఐదు నిమిషాల పాటు మర్దన చేయాలి. గంట తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. వారానికి మూడుసార్లు ఇలా చేస్తే జుట్టు దృఢంగా ఉంటుంది.
-కోడిగుడ్డు తెల్లసొన, కొబ్బరి నూనె, ఆలివ్ నూనె మూడింటినీ బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు మొదళ్లకు బాగా పట్టించాలి. 30 నిమిషాల తరువాత సాధారణమైన షాంపూతో తలస్నానం చేయాలి. తరచూ ఇలా చేస్తే జట్టు ఒత్తుగా మారుతుంది.
-కొబ్బరిపాలను వేడిచేస్తూ అందులో కొంచెం ఆలివ్ నూనె, నిమ్మరసం, మొక్కజొన్న పిండి వేసి బాగా మరిగించాలి. గట్టిగా పేస్ట్‌లా వచ్చే వరకు వేడి చెయ్యాలి. చల్లారాక పొడిగా ఉన్న జుట్టుకు మొదళ్ల నుంచి చివరి వరకు ఈ మిశ్రమాన్ని పట్టించాలి. రెండు గంటల తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే జుట్టు చక్కగా, మృదువుగా మెరుస్తుంటుంది.
-ఆలివ్ నూనె, తేనెలను బాగా కలుపాలి. బ్రష్‌తో ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాయాలి. జట్టు ఆరేవరకు షవర్‌క్యాప్ ధరించాలి. 45 నిమిషాల తరువాత మెరుగైన షాంపూతో తలస్నానం చేయాలి. ప్రతిరోజూ ఇలా చేస్తే జుట్టు పాడవ్వకుండా ఉంటుంది.

726
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles