జుట్టు చిట్లుతుందా?


Wed,February 27, 2019 11:44 PM

జుట్టు అధికంగా చిట్లుతున్నదా? తక్కువ వయసులోనే బట్టతల వస్తున్నదా? వీటన్నింటికీ నెయ్యి తగిన పరిష్కారం. నెయ్యితో ఎలా ఈ సమస్యలను అరికట్టాలో తెలుసుకోండి.
haircare
-తగినంత నెయ్యిని బౌల్‌లో తీసుకోవాలి. దీన్ని చిట్లిన జుట్టుకి రాయాలి. 20 నిమిషాల తర్వాత దువ్వెనతో దువ్వాలి. తర్వాత తక్కువ గాఢత ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే జుట్టు చిట్లడం ఆగడంతో పాటు చుండ్రుకు చెక్ పెట్టడంలోనూ నెయ్యి భేష్‌గా పనిచేస్తుంది.
-గోరువెచ్చని నెయ్యికి బాదం నూనె కలిపి కురుల మొదళ్లలో రాయాలి. 20 నిమిషాల తర్వాత రోజ్‌వాటర్‌తో శిరోజాలను కడుగాలి. నెలకు రెండుసార్లు ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.
-నెయ్యి శిరోజాలకు మంచి కండీషనర్‌గా పనిచేస్తుంది. నెయ్యి, ఆలివ్ నూనెని బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించాలి. 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే కురులు నిగనిగలాడుతాయి.
-మగవాళ్లు బట్టతల నుంచి తప్పించుకోవాలంటే మాసానికి ఒకసారి నెయ్యిని కురులకు పట్టించాలి. ఇలా చేస్తే బట్టతలకి దూరంగా ఉండొచ్చు.

256
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles