జుట్టుతో గిన్నిస్ రికార్డ్


Thu,February 7, 2019 01:28 AM

జుట్టు సరిగా పెరుగక నేటి యువతులు అనేక మార్గాలు, సంరక్షణ చర్యలు చేపట్టాల్సి వస్తున్నది. జుట్టు రాలే సమస్యతో చాలామంది పలు రకాల చికిత్సలు సైతం తీసుకుంటున్నారు. కానీ ఎటువంటి మందులు వాడకుండానే చిన్న వయసులో అత్యంత పొడవైన జుట్టుతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సృష్టించింది ఓ యువతి.
longest-hair-teenager
గుజరాత్‌కు చెందిన నిలాన్షి పటేల్ 16 యేండ్లకే పొడవైన జుట్టుతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. 6 ఏండ్ల వయసులో మాత్రమే ఓసారి తన జుట్టును కత్తిరించుకున్నది. ఆ తర్వాత వరుసగా పదేండ్లు పాటు జుట్టు పెంచి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నది. ప్రస్తుతం 16వ యేట అడుగుపెట్టిన నిలాన్షి 170.5 సె.మి (5అడుగుల 7అంగుళాల) పొడవైన జుట్టు కలిగిన టీనేజర్‌గా గుర్తింపు పొందింది. పొడవుగా జుట్టును పెంచడం వల్ల చాలా సమస్యలు వస్తాయని తమ చుట్టు పక్కల వాళ్లు నిలాన్షికి సలహా ఇచ్చేవారు. కానీ తన హెయిర్ వల్ల స్కూల్లో ఆటలు ఆడే సమయంలోగానీ ఇతర సందర్భంల్లో గానీ ఎటువంటి సమస్య తలెత్తలేదని చెబుతున్నది. నిలాన్షి తల్లి తన జుట్టు సంరక్షణలో ప్రధాన పాత్ర పోషించిందని, రికార్డు సృష్టించడం వెనుక తల్లి సహకారం చాలా ఉందని అంటున్నది. ఏదైనా శుభకార్యానికి వెళ్లేటప్పుడు తనకు నచ్చిన మాదిరిగా జడ వేసుకుంటుందట. వారానికి ఓ సారి తలస్నానం చేయడంతోపాటు జుట్టును ఆరబెట్టుకోవడానికి అరగంట, దువ్వుకోవడానికి గంట సమయాన్ని వెచ్చిస్తానని నిలాన్షి చెబుతున్నది.

230
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles