జీవ ఇంధనంతో మొదటిసారి..


Fri,February 1, 2019 12:19 AM

Etihad_resources
దుబాయికి చెందిన ఎతెహాద్ సంస్థ ప్రపంచంలోనే మొదటిసారి కమర్షియల్ విమానాన్ని జీవ ఇంధనంతో నడుపుతున్నది. చిత్తడి నేలల్లో పెరిగే మొక్కల నుంచి తీస్తున్న ఈ ఇంధనం పర్యావరణానికి ఎలాంటి నష్టం జరుగనివ్వదు. బోయింగ్ 787 అనే ఎయిర్‌క్రాఫ్ట్‌లో ప్రయోగాత్మకంగా మొదటిసారి జీవ ఇంధనం పోసి నడిపారు. అబుదాబి నుంచి అమ్‌స్టెర్‌డామ్ వరకు ప్రయాణించారు. కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి, ముడి చమురు పర్యావరణానికి నష్టం కలిగించే ఇతర ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా దీన్ని రూపొందించారు. ఇది అభివృద్ధిలో ఒక మైలురాయిగా ఎతెహాద్ సంస్థ భావిస్తున్నది. స్థానికంగా ఉత్పత్తి జరుగుతున్నా.. ఓ రీసెర్చ్ సంస్థ సహకారం అందిస్తున్నది. వైమానిక రంగంలో అన్ని సంస్థలతో పోటీపడుతున్న ఎతెహాద్ ఇప్పుడు ఈ విజయాన్ని సాధించింది. సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో ప్రయాణికులకు కూడా ఇది ప్రయోజనకరం అవుతుందని ఆ సంస్థ ప్రతినిధులు భావిస్తున్నారు. ఇంధన ధరలు తగ్గితే టికెట్ల ధరలు కూడా తగ్గి ప్రయాణికులకు లాభం చేకూరుతుంది.

842
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles