జీవుల వలెనే మొక్కలు


Tue,March 5, 2019 03:12 AM

Elagante
మొక్కలు లేని ప్రకృతి పరిసరాలు ఉండవు. మరి, అవి ఎలా పెరుగుతాయి? దేనివల్ల వాటిలో పెరుగుదల సాధ్యమవుతుంది? మొక్కలు పెరగడానికి నీరు, పోషకాలు, గాలి, సౌరశక్తి, చాలినంత ప్రదేశం, సమయం అవసరం. కదలకుండా ఒకేచోట స్థిరంగా వుండేవే అయినా వీటికి కూడా ప్రాణం ఉంటుందని మనకు తెలుసు. జీవుల వలెనే వీటి ఎదుగుదలకు పైన పేర్కొన్నవన్నీ ఉండాలి. ఏ ఒక్కటి లేకపోయినా, తక్కువైనా లేదా ఎక్కువైనా వాటి పెరుగుదలలో లోపం ఏర్పడుతుంది. నీటిలోని తేమను, మట్టిలోని పోషకాల (నైట్రోజన్, ఫాస్పరస్, పొటాషియం)ను మొక్కలు, చెట్ల వేర్లు గ్రహించి తమ కాడలు, ఆకులకు అందజేస్తాయి. నేలలో సేంద్రియ ఎరువులు వేయగలిగితే వాటికి మరింత బలవర్దకం. పచ్చదనం కోసం నైట్రోజన్, రోగాల బారిన పడకుండా ఉండడానికి పొటాషియం, పూలు సరిగా పూయడానికి ఫాస్పరస్ మొక్కలకు తప్పనిసరిగా ఉండాలి. అయితే, గాలి, నీరు పూర్తి కాలుష్య రహితంగా ఉండాలి. లేకపోతే, సూర్యరశ్మి ఆధారంగా జరిపే కిరణజన్య సంయోగక్రియ సమర్థవంతంగా జరగదు. అలాగే, మొక్కలు పుష్ఠిగా పెరగడానికి వాటిమధ్య (గాలి ఆడేంత) చోటు తప్పనిసరి. చాలినంత ఉష్ణోగ్రత లేకపోయినా ఆహార ప్రక్రియ (కిరణజన్య సంయోగ క్రియ)కు ఆటంకం ఏర్పడి పెరుగుదలకు కావలసినంత శక్తి వాటికి లభించదు.

396
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles