జీవితాలను చిగురింపచేసేందుకు!


Fri,April 12, 2019 01:08 AM

ఎయిడ్స్ వ్యాధి్రగ్రస్తుల్లో సానుకూల దృక్పథం తీసుకువచ్చి వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంచేందుకు ఓ మహిళ శ్రీకారం చుట్టింది. అటువంటి వారికి పెండ్లిళ్లు జరిపించి వారికి జీవితంపై నూతన ఆశలు చిగురింపజేస్తున్నది.
positive-patients
హెచ్‌ఐవీ బాధితులకు సరైన అవగాహన కల్పించి వారికి కూడా తోడు అందించేందుకు ముందుకు వచ్చింది గుజరాత్‌కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ. తోడు కోసం వెతుక్కుంటున్న ఎయిడ్స్ రోగులకు ఆన్‌లైన్ వివాహ వేదికలు ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. సూరత్ కేంద్రంగా పనిచేసే గుజరాత్ స్టేట్ నెట్‌వర్క్ ఆఫ్ పాజిటివ్ పీపుల్ సంస్థ అహ్మదాబాద్ ఐఐఎం సాంకేతిక సహకారంతో తాజాగా ఆన్‌లైన్ వివాహ వేదికను ప్రారంభించింది. ఇప్పటికే ఈ రోగుల సమస్యలపై పోరాడుతూ వారి ప్రయోజనాలకోసం గుజరాత్ కేంద్రంగా ఈ సంస్థ పనిచేస్తున్నది. గుజరాత్‌లోనే కొన్ని వేల మంది యాంటీ రిట్రోవైరల్ థెరపీ (ఏఆర్టీ )సెంటర్‌కు వెళ్తున్నారు. అటువంటి వారి వివరాలు సేకరించి వారిలో పెండ్లి చేసుకోవాలనే కొత్త ఆశను చిగురింపచేసి వారి జీవితాల్లో కొత్త వెలుగుల్ని నింపుతున్నది జీఎస్‌ఎన్‌పీ ప్లస్ వ్యవస్థాపకురాలు దక్షా పటేల్. పెండ్లి చేసుకోవాలనుకుంటున్న వారి ఇరువురి కుటుంబాల్లోని పెద్దలను కలిసి ముందుగా ఈ విషయం తెలియజేసిన తర్వాతనే వారికి పెండ్లి జరిపిస్తారు. ఇప్పటి వరకూ కొన్ని వేల మంది ఒకటయ్యారు. ఒకే సమస్యతో బాధపడుతున్న వారు తోడుంటే, మానసికంగా సంతోషంగా ఉంటారు. అంతేకాకుండా మెరుగైన జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుందన్న లక్ష్యంతో ఈ సంస్థ ఆన్‌లైన్ వివాహ సేవలు అందించేందుకు ముందుకు వచ్చింది.

86
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles