జీర్ణ సమస్యలతో మోకాళ్ల నొప్పులు?!


Tue,August 1, 2017 12:44 AM

జీవనశైలి సరిగ్గా లేకపోవడం ఎలాంటి అనారోగ్యానికైనా కారణం అవుతుంది. మానవ శరీరం పగలు పనిచేసి రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. కానీ ఇప్పుడు మారిన జీవన స్థితిగతుల్లో చాలామంది రాత్రుళ్లు మేల్కొని ఉండాల్సి వస్తున్నది. కానీ రాత్రి పూట శరీరంలో జీవక్రియలన్నీ కూడా చాలా నెమ్మదిగా సాగుతాయి. అందువల్ల తీసుకునే ఆహారం త్వరగా జీర్ణం కాదు. ఫలితంగా విసర్జన క్రియ కూడా సరిగా ఉండదు. అందువల్ల శరీరంలో హానికరమైన ఆమ్లం ఉత్పన్నమవుతుంది. ఇది జీర్ణాశయంతో పాటు నాడీ వ్యవస్థనూ, కండరాలను, ఎముకలను, కీళ్లను కూడా ప్రభావితం చేస్తుంది. చివరకు మెడ, వెన్ను, కీళ్ల నొప్పులకు కారణమయ్యే సంధివాతానికి కూడా కారణమవుతుంది.
ayurvedam

సంధి వాతం అంటే..


శరీరంలోని కదలికలకు అవసరమైన వాతం సహజంగానే అందరి శరీరాల్లోనూ ఉంటుంది. అయితే ఈ వాతం ప్రకోపితమైనపుడు అంటే సమస్థితిని కోల్పోయినపుడు సంధివాతం (ఆస్టియో ఆర్థరైటిస్) మొదలవుతుంది. దీన్నే వాతం దూషితం కావడం అంటారు. సహజంగా వాతం కఫాన్ని దూషితం చేసినప్పుడే సంధివాతం మొదలవుతుంది. ఈ సమయంలో దూషిత లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాల్లో ప్రధానంగా కీళ్లు బిగుసుకు పోవడం, కదిలినపుడు శబ్ధాలు రావడం, ముట్టుకున్నపుడు ఆ భాగం వేడిగా అనిపించడం, ఎరుపుదనం కలిగి ఉండడం, నిలబడే, కూర్చునే సమయంలో నొప్పి అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంత మందిలో విశ్రాంతి తర్వాత వెంటనే లేచి నడువలేని స్థితి కనిపిస్తుంది. కొంత సమయం గడిచిన తర్వాత బిగుసుకున్న భాగాలు సడలి, నడకలో కొంత సౌకర్యం ఏర్పడుతుంది. సంధివాతంలో ఇది ఒక ముఖ్యలక్షణంగా ఉంటుంది.

చల, స్థిర సంధులు


కీళ్లు.. చల సంధులని, స్థిర సంధులనీ రెండు రకాలు. కదిలే కీళ్లను చల సంధులనీ, కదలని కీళ్లను స్థిర సంధులని అంటారు. చలసంధుల్లోనే కీళ్లవాతం వస్తుంది. చలసంధుల్లో శరీర భాగాలన్నింటినీ ఆవరించుకొని, కొన్ని మెంబ్రేన్‌లు దెబ్బతినడమే ఇందుకు కారణం. మొత్తంగా అష్టాధర కలలు అంటే ఎనిమిది పొరలు ఉంటాయి. వాటిలో శ్లేష్మధరా కల అనే పొర ఉంటుంది. ఈ పొరలోని ఫ్లూయిడ్ కీళ్లు కదులడానికి తోడ్పడుతుంది. కదిలే కీళ్లు సహజంగా శ్లేష్మం, సిరలు, కండారాలతో కూడుకొని ఉంటాయి. ఈ శ్లేష్మధరా కలలో వాత ప్రకోపం ధూషింపబడితే అది తన సహజ స్థితిని కోల్పోతుంది. దీనివల్ల శరీరంలో ఆమ్ల పదార్థాలు ఏర్పడుతాయి. ఫలితంగా కొన్ని సమస్యలు తలెత్తుతాయి. అందులో భాగంగా మోకాళ్ల నొప్పులు మొదలవుతాయి.
srinivas

ఆయుర్వేద చికిత్స


ఏ కారణంగా సంధివాతం అంటే కీళ్లనొప్పులు మొదలైనా, వాత హర చికిత్సలు చేయబడడం ద్వారా ఆ సమస్యను తొలగించవచ్చు. అరిగి పోయిన కార్టిలేజ్ తిరిగి వృద్ధి చేయడం ద్వారా మాత్రమే ఈ సమస్య శాశ్వతంగా తొలగిపోతుంది. అందుకు ఆయుర్వేదంలో కొన్ని ప్రత్యేకమైన ఔషధ యుక్త తైలాలతో చేసే జానువస్తి చికిత్స ఉంటుంది. దీనివల్ల మోకాళ్లలో అరిగిపోయిన భాగాలన్ని తిరిగి వృద్ధి చెందుతాయి. తైలాల ద్వారా కొన్ని రకాల మాత్రల ద్వారా అరిగిపోయిన కార్టిలేజ్‌ను పునరుద్ధరించే శక్తి ఆయుర్వేదం తైలాలకు మాత్రమే ఉంటుంది. జానువస్తి చికిత్సలు ఎవరైనా చేయవచ్చు. కానీ ఆ సమయంలో కీళ్లలోకి పంపించే తైలం పాత్రే ఇక్కడ కీలకం. ఆ తైలం ఎంతో ప్రత్యేకమైనది. ప్రత్యేక తైలాలు, ప్రత్యేకమైన ఔషధాలతో మోకాళ్ల నొప్పులు సమూలంగా తొలగిపోతాయి. ఆయుర్వేద వైద్యులు సూచించిన చికిత్సలన్నీ క్రమం తప్పకుండా తీసుకుంటే సమస్య సమూలంగా సమసి పోతుంది.

330
Tags

More News

VIRAL NEWS