జీర్ణక్రియను మెరుగుపరిచే జ్యూస్‌


Thu,March 14, 2019 12:19 AM

juice
వేసవికాలం వచ్చిందంటే చిన్నాపెద్దా అందరూ చల్లటి జ్యూస్‌లే కోరుకుంటారు. పళ్లరసాలు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కొంతమందికి కొన్ని పళ్లరసాలు పడవు. ఫ్రూట్‌జ్యూస్‌లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
కడుపులోని పేగులను స్మూత్‌గా చేసి ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. హైపర్ అసిడిటీ, హార్ట్ బర్న్, గ్యాస్ట్రిక్ సమస్యలను దూరం చేస్తాయి. ఆరెంజ్ జ్యూస్‌లోని విటమిన్ సి కడుపులో సిట్రిక్ ఆసిడ్ శాతాన్ని పెంచుతుంది. దీంతో జీర్ణక్రియ వేగంగా జరుగుతుంది. అల్సర్, రక్తస్రావం నివారించి మెటబాలిజం పెంచుతుంది. ద్రాక్షరసం జీర్ణవ్యవస్థలోని మలినాలను తొలిగించి, శరీరానికి కావాల్సిన యాంటీఆక్సిడెంట్స్‌ని అందిస్తుంది. పండ్లలో రారాజు మామిడి. ఏ పండులో లేని విటమిన్స్, మినరల్స్ మామిడిపండులో ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్లు జుట్టుకు ఆరోగ్యాన్నివ్వడంతో పాటూ శరీరానికి కావాల్సిన ఫైబర్ కంటెంట్ కూడా అందిస్తుంది. ఏం తిన్నా అరగాలి కాబట్టి జ్యూస్ తీసుకునే ముందు దాని ఉపయోగాలు కూడా తెలుసుకుంటే మంచిది.

855
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles