జలుబు గుట్టు తెలిసింది!


Mon,June 8, 2015 01:57 AM

4_065_ColdFluRescue


చల్లగా ఉంది.. బయటికి వెళ్లకు...ఇంత చల్లగా ఉంటే దుప్పటి కప్పుకోవేం..
బయటికి వెళ్లేటప్పుడు స్వెటర్ వేసుకుని వెళ్లు.. చల్లగాలిలో తిరిగితే జలుబు పట్టుకుంటుంది...
ఇలాంటి మాటలు ప్రతి అమ్మ నోట వింటూనే ఉంటాం. దీనిలో నిజం ఎంత ఉంది?
పెద్దవాళ్లు చెప్పే ఈ మాటలకు శాస్త్రవేత్తలు కూడా వంత పాడుతున్నారు. ఇటీవల నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నిర్వహించిన ఒక అధ్యయనంలో ఆసక్తికరమైన విషయం తేలింది. చల్లగా ఉండే వాతావరణంలో మనకు జలుబును కలిగించే రైనోవైరస్ చాలా తొందరగా పెరుగుతుంది. మన శ్వాసమార్గాల్లో మరింత సులువుగా, వేగంగా పునరుత్పత్తి చెందుతుందని ఈ పరిశోధన స్పష్టం చేస్తున్నది.

అంతేగాక చల్లని వాతావరణంలో మన వ్యాధి నిరోధక వ్యవస్థ కూడా బలహీనంగా ఉంటుంది. తద్వారా వైరస్ చాలా సులభంగా లోపలికి ప్రవేశించగలుగుతుంది. ఎలుకలోని శ్వాసమార్గాల నుంచి సేకరించిన కణాలను సాధారణ శరీర ఉష్ణోగ్రత, ఊపిరితిత్తుల ఉష్ణోగ్రత (37 డిగ్రీల సెంటీగ్రేడ్), తక్కువ ఉష్ణోగ్రత (33 డిగ్రీల సెంటీగ్రేడ్) లలో ఉంచి వాటిపై రైనోవైరస్ చర్యలను గమనించి, ఈ అంశాన్ని స్పష్టపరిచారు. సాధారణ శరీర ఉష్ణోగ్రతల కన్నా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద వ్యాధినిరోధక చర్యలు చురుగ్గా లేవంటున్నారు అధ్యయనకారులు. కాబట్టి చల్లని వాతావరణంలో తప్పనిసరిగా వెచ్చని దుస్తులు ధరించడంతో పాటు ముక్కుకు కూడా ఏమన్నా అడ్డంగా కట్టుకోవాలి.

716
Tags

More News

VIRAL NEWS