జనవరి నుంచి రైళ్లలో షాపింగ్!


Mon,December 31, 2018 12:59 AM

షాపింగ్ అంటే మక్కువ చూపని ఆడవాళ్లుంటారా? సమయం దొరికితే చాలు. షాపింగ్ అంటూ బయలుదేరుతారు. అయితే ప్రయాణాల్లో ఉంటే... వారి సమస్యను తీర్చడానికన్నట్లు రైళ్లలో షాపింగ్‌ను ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలుపుతున్నారు.
Cover
విమానాల్లో మాదిరిగా ఇక రైళ్లలోనూ ప్రయాణికులు షాపింగ్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. జనవరి నుంచి రైళ్లలో ప్రయాణికులు సౌందర్య ఉత్పత్తులు, గృహోపకరణాలు, ఫిట్‌నెస్ టూల్స్ కొనుగోలు చేసే విధంగా ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇందుకు సంబంధించి పశ్చిమ రైల్వే ముంబయి డివిజన్ ఓ ప్రైవేటు కంపెనీకి ఐదేళ్ల పాటు కాంట్రాక్టు కింద లైసెన్సు ఇచ్చింది. మొదటి దశలో భాగంగా రెండు రైళ్లలో ఈ సదుపాయాన్ని తీసుకురానున్నారు. ఆ తర్వాత దశల వారీగా ఇతర రైళ్లలోను ప్రవేశపెట్టనున్నారు. తర్వాత దేశమంతా ఈ పద్ధ్దతిని అమల్లోకి తెస్తామని అధికారులు తెలుపుతున్నారు.

281
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles