జంతుశాస్త్రం గడ్డి తినే సొరచేప


Tue,February 19, 2019 01:36 AM

సముద్ర గడ్డి (సీగ్రాస్)ని ఇష్టంగా తినే ప్రపంచ తొలి సొర చేప జాతిని జంతు శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించారు. బోనెట్‌హెడ్ షార్క్‌లు మాంసాహార షార్క్‌ల కంటే భిన్నంగా శాఖాహారాన్ని జీర్ణం చేసుకోగల జీవద్రవ్యాన్ని గణనీయంగా కలిగి ఉన్నాయని వారు తేల్చారు.
Jantu-Shastram
షార్క్ చేపలన్నీ మాంసాహారివేనా? అంటే కాదు అన్న సమాధానం ఇప్పుడు జంతు శాస్త్రవేత్తల నుంచి వస్తున్నది. సీగ్రాస్ (సముద్రగడ్డి)ను ఇష్టంగానే తినే బోనెట్‌హెడ్ షార్క్‌లను ప్రపంచంలోనే తొలి సర్వభక్షక (మాంస, శాఖాహార) జాతిగా వారు గుర్తించారు. అమెరికాలోని నోవా ఫిషరీస్ (National Oceanic and Atmospheric Administration: NOAA) కు చెందిన జీవావరణ శాస్త్రవేత్త డ్యానా బేథియా ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనలో ఈ విషయం తేలింది. మొత్తం అయిదు బోనెట్‌హెడ్ షార్క్‌లను సేకరించి, అక్వేరియంలో నివసింపజేస్తూ అధ్యయనం జరిపారు. వాటికి ఆహారంలో 90 శాతం సీగ్రాస్‌ను, 10 శాతం మాంసాహారాన్ని ఇచ్చారు. సీగ్రాస్‌ను అవి చక్కగా జీర్ణం చేసుకొన్నట్లు నిర్ధారణైంది. కాగా, బోనెట్‌హెడ్ షార్క్‌లు హ్యామర్‌హెడ్ షార్క్‌లకు సమీప బంధువులని, ఇవి రెండో అతిచిన్న కుటుంబానికి చెందినవని వారు తెలిపారు. ఐతే, సీగ్రాస్ పేరుకే గడ్డి. ఎందుకంటే, సముద్రగర్భ అవక్షేపాలపై పెరిగే పూలు పూచే మొక్క ఇది. కాగా, ఈ పరిశోధనా ఫలితాలు ప్రొసీడింగ్స్ ఆఫ్ ది రాయల్ సొసైటీ- బిలో ప్రచురితమైనాయి.

507
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles