చైనీస్ న్యూ ఇయర్ వేడుకలు


Sun,February 10, 2019 01:42 AM

కొత్త సంవత్సరం వచ్చేసి ఇప్పటికే నెల రోజులు పూర్తయింది. మళ్లీ కొత్త సంవత్సరమేంటి అనుకుంటున్నారా? మనకు ఉగాది ఎలాగో.. చైనాకి కూడా మరో కొత్త సంవత్సరం ఉంటుంది. అది మొన్ననే మొదలైంది. ఒక్కో సంవత్సరం అక్కడ ఒక్కో జంతువును పూజిస్తారు. ఇంకా అక్కడి వేడుకలెలో ఉంటాయో చూసొద్దాం రండి..
Big
చైనాలో నెలరోజుల పాటు ఈ సంవత్సరాదిని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. బంధువులందరినీ పిలుచుకుంటారు. ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి 5 నుంచి మరింత ఘనంగా ఈ వేడుకలు మొదలు పెట్టారు. మామూలుగా అయితే ల్యూనార్ క్యాలెండర్ ప్రకారం జనవరి 21 నుంచి ఫిబ్రవరి 20 వరకు ప్రతీ సంవత్సరం సంబురాలు జరుగాల్సిందే. ఈ సంవత్సరం కాస్త ఆలస్యంగా ఈ వేడుక మొదలైంది.

పాజిటివ్‌గా ఉండాలని..

పండుగ అంటే ముందు ఇంటిని శుభ్రం చేయడంతో ప్రారంభమవుతుంది. అచ్చు చైనాలో కూడా అలాగే దుమ్ము, ధూళిని దులిపి మిగతా పనులు ప్రారంభిస్తారు. ఇంట్లో ఉండే దుష్టశక్తులు పోయి పాజిటివ్ ఎనర్జీ రావాలని ఎరుపురంగు గల స్ప్రింగ్ కప్లెట్స్‌తో ఇంటిని అలంకరిస్తారు. ఇవి ఇంటికి అందంతో పాటు సంతోషాన్ని తీసుకు వస్తాయని వారి నమ్మకం. నెల మొత్తంలో ఫిబ్రవరి 4 చాలా ముఖ్యమైన రోజుగా భావిస్తారు. ఆ రోజున చుట్టాలందరూ ఒకచోట చేరుతారు. ఇష్టమైన, రుచికరమైన తొమ్మిది రకాల వంటలు వండుతారు. ఇందులో ఎనిమిది రకాలయితే పక్కాగా ఉండాల్సిందే! తొమ్మిదో వంటని ఆప్షన్‌గా వదిలేస్తారు. అందులో చికెన్ తప్పనిసరిగా ఉండాలి. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణం చేస్తారు. చుమ్‌యున్ రష్ అనే ఒక స్థలం ఉంటుంది. అక్కడికి వెళ్లి అందర్నీ కలుసుకుంటారు. చిన్న పిల్లలందరికీ ఎరుపు రంగు గల ఎన్వలప్‌ని ఇస్తారు. అందులో ఉత్తరాన్ని ఉంచుతారు. అందులో పిల్లలను ఆశీర్వదిస్తూ, వారి ఎదుగుదలకు ఉపయోగపడేలా కొంత డబ్బుని కూడా అందిస్తారు.

ఒక్కొక్కరికీ ఒక్కో గుర్తు..

12 యేండ్ల రాశిచక్ర చివరి భ్రమణంలో ఆఖరిది. 1923, 1935, 1947, 1959, 1971, 1983, 1995, 2007, 2019లో జన్మించిన వారిలో ఆయా గుర్తులు ఉంటాయి. Chinesenewyear.net ప్రకారం ఈ సంవత్సరంలో పుట్టినరోజు రాశి, నక్షత్రం ఆ సంవత్సరపు జంతువుతో పోల్చుకొని వారు అదృష్టవంతులో కాదో తెలుసుకుంటారు. మొత్తానికి నెలరోజుల పాటు ఆనందంగా సంబురాలు జరుపుతారు. దీన్నే చైనీస్ న్యూ ఇయర్ అని అంటారు. ఆ రోజుని ఆసియా దేశాల్లో అంటే థాయ్‌లాండ్, సింగపూర్‌లో వారితో కలిపి ఈ పండుగను చేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. కాకపోతే వియత్నాం న్యూ ఇయర్ వేడుకలను టెట్ అని పిలుస్తారు. ఈ వేడుకలు కూడా చైనావాళ్లలాగే జరుపుకుంటారు. ఈ పండుగను ఏడు రోజులు మాత్రమే చేస్తారు.

పండుగ ముగిసే రోజు..

Big1
అన్ని రోజులు ఆనందంగా జరిపే ఈ వేడుకలు ఫిబ్రవరి 20తో ముగుస్తాయి. ఆ రోజు రాత్రి నిండు చందమామతో లాంతరు పండుగ జరుపుకుంటారు. కుటుంబ సభ్యులంతా సంతోషంగా నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తారు. చివరిరోజు నాడు కాగితంతో తయారు చేసిన డ్రాగన్‌తో ఆడిపాడుతారు. డ్రాగన్ జంతువు అందరికీ శుభారంభమని అక్కడి నమ్మకం. చైనీస్ న్యూ ఇయర్‌కి ఒక్కొక్క జంతువును అంకితం చేస్తుంటారు. ఆ విధంగా ఇప్పటివరకు 12 జంతువులను అంకితం చేశారు. ఎలుక, ఎద్దు, పులి, కుందేలు, డ్రాగన్, పాము, గుర్రం, గొర్రె, కోతి, కోడిపుంజు, కుక్క. ఇలా పదకొండు జంతువులను ఒక్కొక్క సంవత్సరంగా భావించారు. ఈ సంవత్సరం అంటే 2019కి పందిని అంకితం చేస్తూ దాన్ని పూజిస్తారు. ఆ సంవత్సరంలో జన్మించిన వ్యక్తుల రాశిచక్రాలను తెలుసుకుంటారు. పాత జంతువుకు వీడ్కోలు పలుకుతూ కొత్త జంతువును ఆహ్వానిస్తూ పార్టీ చేసుకుంటారు.
-వనజ వనిపెంట

1221
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles