చేతుల శుభ్రానికి సోపెన్


Mon,January 14, 2019 01:33 AM

అతిసార వ్యాధితో బాధపడుతూ మరణిస్తున్న శిశువుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతున్నది. వీరి ప్రాణాలను కాపాడేందుకు ఇద్దరు మహిళలు చాలెంజ్‌గా తీసుకున్నారు. వారి కోసం ఒక ఉత్పత్తిని తయారు చేశారు.
shubam
అతిసార వ్యాధి మన దేశంలోని చాలామంది శిశువుల ప్రాణాలు బలిగొంటున్నది. ఈ రకంగా యేడాదికి సుమారు 13 శాతం మంది చనిపోతున్నారు. వారు కూడా ఐదు సంవత్సరాల్లోపు బాలలే. వీరికి ఈ వ్యాధి రావడానికి కారణం వారి తల్లిదండ్రులేనంటున్నారు వైద్య నిపుణులు. ఎక్కువమంది పిల్లలు బహిరంగ ప్రదేశాల్లో తిరిగి, ఆడుకుంటూ చేతులు కడుక్కోకుండానే ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఆకలి అవ్వడంతో చేతుల శుభ్రత గురించి పట్టించుకోకుండా భోజనం ఆరగించేస్తారు. సబ్బుతో చేతులు శుభ్రపరుచుకోనందువల్ల అతిసార వ్యాధికి గురువుతున్నారని తెలిసింది. దీనికి పరిష్కారానికి ఇద్దరు మహిళలు నాంది పలికారు. శుభం, అమానథ్ అనే మహిళలు యూఎస్‌ఏలోని పర్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్‌లో డిగ్రీ చేస్తుండగానే ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టారు. మొత్తానికి ప్రాజెక్ట్‌ను పూర్తిచేసి ఒక ప్రాడక్ట్‌ను తయారుచేశారు. దాని పేరే సోపెన్. ఎలా అంటే ఆహారం తీసుకొనే ముందు సబ్బు అవసరం లేకుండా సోపెన్‌తో చేతులను శుభ్రపరుచుకోవాలి. సబ్బులో ఉండే సల్ఫేట్స్, పాథలెట్స్, పారాబెన్స్, ఈడీటీఏలాంటి హానికర పదార్థాలు ఇందులో ఉండవు. కాబట్టి ఇది ఆరోగ్యానికి కూడా హాని చేయదు. ఈ పెన్‌తో రాసి కొన్ని గోరువెచ్చని నీళ్లతో చేతిని కడిగితే సరిపోతుంది. ప్రస్తుతానికి అమెరికాలో ఇది దొరుకుతున్నది. త్వరలోనే భారతదేశంలోని అతిసార వ్యాధితో బాధపడే పిల్లలకు పంపిణీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అంతేకాదు.. పేద కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని తక్కువ ధరకే అందుబాటులోకి తెచ్చారు. సోపెన్‌ని వాడితే పిల్లల ఆరోగ్యం సరిగా ఉంటుందని వారు పేదప్రజలకి భరోసా కల్పిస్తున్నారు.

551
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles