చెరువుపై తేలియాడే ద్వీపం!


Thu,January 17, 2019 01:45 AM

ఒక చెరువు కబ్జాదారుల చేతిలో పడి.. దాదాపు అంతరించిపోతున్న తరుణంలో తిరిగి ప్రాణం పోసుకున్నది. పరిశుభ్రంగా మారి భారతదేశంలోనే అతిపెద్ద తేలియాడే ద్వీపంగా రికార్డుల్లోకెక్కింది. ఎలా? ఎప్పుడు? ఎక్కడ?
Floating-Wetlands
బెంగళూరు నగరంలో కట్టడాలు ఎక్కువ కావడంతో నీటి కరువు ఎక్కువ అవ్వడం ప్రారంభమయింది. కాలుష్యం బారినపడి, కబ్జాల పాలవుతున్న చెరువులను ఇప్పటికే పలు స్వచ్ఛంద సంస్థలు దత్తత తీసుకొని పరిశుభ్రంగా మారుస్తున్నాయి. అక్కడి హెబ్బగోడి చెరువు మాత్రం కాస్త భిన్నం. అపార్ట్‌మెంట్లలో వాడిన నీళ్లను వృథా కాకుండా పైప్‌ల ద్వారా చెరువులోకి వదులుతున్నారు. బయో ఎంజిమ్ అనే సిస్టమ్ ద్వారా నీళ్లను శుద్ధి చేస్తూ అందులో చేపల పెంపకాన్ని చేపట్టారు. చెరువు నీటిలో తేలియాడే మొక్కలను పెట్టారు. ఆ మొక్కల వేర్లు నీటిని శుద్ధి చేస్తాయి. అలా చెరువు మధ్యలో తేలియాడే మొక్కలు చెరువును పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా తేలియాడే ఒక ద్వీపంలా కనిపిస్తాయి. ఇవి పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించవు. దీంతో 1 2వేల చదరపు అడుగుల మేర తేలియాడే మొక్కలున్న ఏకైక పెద్ద చెరువుగా ఇది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కింది. బయోకాన్ స్వచ్ఛంద సంస్థ ఈ చెరువును పచ్చగా, పరిశుభ్రంగా మార్చుతున్నది. ఇదిప్పుడు మామూలు చెరువే కాదు పర్యాటక ప్రదేశం కూడా. నీళ్లలో ఉన్న ఆక్సిజన్ శాతాన్ని పెంచడం ఈ చెరువు ప్రత్యేకత.

450
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles