చూడముచ్చటైన పర్యాటకం బాదామి


Fri,December 28, 2018 01:18 AM

భారతదేశ పర్యాటక పటంలో ఖ్యాతి గడించిన ప్రాంతంగా కర్ణాటక ఉంది. పశ్చిమ తీరం, దక్కన్ పీఠభూమి మధ్య ఉన్న ప్రాంతం కర్నాటక. అందులో చెప్పుకోదగింది బాదామి. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన బాదామి చూడముచ్చటైన ప్రదేశం.
Bhutanatha_temple
బాదామిలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి గుహాలయాలు, శిలా తోరణాలు, కోటలు, శిల్పాలు. ఇక్కడి బౌద్ధ గుహలోకి కేవలం మోకాళ్లపై పాకుతూ మాత్రమే వెళ్ళగలం. 5వ శతాబ్దంలో నిర్మితమైన భూతనాథ ఆలయం ఒక చిన్న గుడి. ఇది అగస్త్య చెరువుకు ఎదురుగా నిర్మితమైంది. కొండపై నిర్మించిన బాదామి కోటను చూసి తీరాల్సిందే.7వ శతాబ్దంలో నిర్మించిన అనేక శివాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అందులో ముఖ్యమైంది మేలెగట్టి శివాలయం, దత్తాత్రేయ ఆలయం,11వ శతాబ్దంలో నక్షత్రాకారంలో నిర్మించిన మల్లికార్జున ఆలయం అందర్నీ ఆకర్శిస్తాయి. కోట దక్షిణ భాగాన ఇస్లామిక్ శైలిలో నిర్మించిన గుమ్మట ప్రత్యేక ఆకర్షణ. బాదామి నగరాన్ని వీక్షించడానికి వీలుగా ఉత్తర కోటలో నిర్మించిన ఎత్తైన స్థానాలపైకి ఎక్కి చూస్తే నగరమంతా తీర్చిదిద్దిన బొమ్మల కొలువును తలపిస్తుంది. బాదామి, ఐహోల్, పత్తడకల్ ప్రాంతాల నుంచి సేకరించిన శిల్పాలతో ఏర్పాటుచేసిన పురాతత్వ మ్యూజియం కూడా ఇక్కడి పర్యాటక ప్రాంతాల్లో ఒకటి.

344
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles