చుండ్రు నివారణకు..


Mon,January 21, 2019 12:02 AM

చాలామంది చుండ్రు సమస్యతో బాధ పడుతుంటారు. ఎన్నో ఆంటీడాండ్రఫ్ షాంపులు వాడుతుంటారు. అలా కాకుండా ఇంట్లోనే దొరికే చిన్న చిన్న పదార్థాలలో చక్కటి నివారణ మార్గాలు ఉన్నాయి. అవేంటో చూడండి..
dandra
-రెండు స్పూన్‌ల కొబ్బరినూనె తీసుకోండి. అంతే మోతాదులో నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని తలమీద రాయండి. 20 నిమిషాలు దాన్ని అలా ఉంచి కడిగేస్తే ఫలితం ఉంటుంది.
-చుండ్రు నివారణ కోసం పెరుగును వాడటం మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాస్త పెరుగును వెంట్రుకలకు, తలమీద రాయండి. అది కొంచెం గట్టి పడేంతవరకు వేచి చూడండి. తర్వాత కడిగేయండి.
-తడిగా ఉన్న వెంట్రుకలను బేకింగ్ సోడాతో తుడవండి. తలమీద మర్ధన చేయండి. గంట నుంచి గంటన్నర తర్వాత నీటితో కడిగేయండి. ఫలితం కనిపిస్తుంది.
-హెన్నా లేదా మెహంది వెంట్రుకలకు పెట్టడం ద్వారా వెంట్రుకలు ఆరోగ్యవంతంగా తయారవుతాయి. దీంతో పాటు చుండ్రును కూడా నివారించవచ్చు. హెన్నాను పెరుగుతో లేదా నిమ్మరసంతో బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని వెంట్రుకలకు, తలమీద అప్లయ్ చేయండి. రెండు గంటలు ఉంచిన తర్వాత నీటితో కడిగేస్తే చుండ్రు తొలగిపోతుంది.
-ముల్తాని మట్టిని పేస్ట్‌లా తయారు చేయాలి. నీళ్లు, నిమ్మరసంతో బాగా కలిపాలి. ఈ మిశ్రమాన్ని వెంట్రుకలకు పెట్టి 30 నిమిషాల తర్వాత తీసేస్తే మంచి ఫలితం ఉంటుంది.

720
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles