చుండ్రు కాదు.. అది సొరియాసిస్


Wed,February 24, 2016 12:04 AM

చర్మం మర్మం తెలుసుకోవడం అంత సులువేమీ కాదు. తల నుంచి పొడిగా రాలుతున్నంత మాత్రాన చుండ్రే అనుకుంటే ఎలా? తెలిసిన వ్యాధి లక్షణాన్నే అన్ని వ్యాధులకూ ఆపాదిస్తూ వెళితే చివరికి నష్టపోయేది మనమే. లక్షణాలు ఒకేలా కనిపించినంత మాత్రాన వ్యాధులన్నీ ఒకటే కావు. ఒక్కోసారి ఫలానా వ్యాధి అని గుర్తించేలోపే వ్యాధి శరీరమంతా పాకిపోవచ్చు. సొరియాసిస్ లాంటి వ్యాధులు పైకి చర్మం మీదే ఉన్నట్టు అనిపించినా లోలోపల అవి శరీరంలోని ఇతర అవయవాల మీద కూడా తమ ప్రభావాన్ని చూపుతాయి. ప్రత్యేకించి, శరీరంలోని ఇతర కీలక అవయవాలన్నింటి మీదా ఎంతో ప్రభావం చూపే సొరియాసిస్ 90 శాతం మందిలో తల మీదే మొదలవుతుంది. చుండ్రు కూడా తలమీదే రావడం చాలామంది సొరియాసిస్‌ను చుండ్రుగా పొరబడుతుంటారు.

చేపపొట్టులా రాలుతుంటే...


సొరియాసిస్‌కు, చుండ్రుకూ ఉన్న తేడా ఇట్టే తెలిసిపోతుంది. అలా పరిశీలించకపోవడం వల్లనే సొరియాసిస్‌ను చాలామంది చుండ్రుగా పొరబడుతుంటారు. వాస్తవానికి ఈ రెండింటికీ మధ్య ఒక స్పష్టమైన తేడా ఉంది. మూడు నాలుగు రోజులు తలస్నానం చేయకుండా ఉండిపోయి, ఆ తరువాత దువ్వితే పొడిలా రాలితే అది చుండ్రు. అలా కాకుండా చేపపొట్టులా పెళుసులు, పెళుసులుగా రాలితే అది సొరియాసిస్. ఇది ఎవరైనా సులువుగా పసిగట్టగలిగే తేడాలు. కాకపోతే, అది సొరియాసిస్ అని గుర్తించి కూడా కొందరు, ఇంకా తలమీదే ఉంది కదా.. అది శరీరం మీదికి పాకిన తరువాత చూసుకోవచ్చులే అనుకుని మిన్నకుండిపోతారు. అది మరీ ప్రమాదం. ఈ దశలో ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే, కొద్దిరోజులయ్యాక ఒక్కొక్కటిగా ఏవేవో వ్యాధులు బయటపడడం మొదలవుతుంది. అప్పటిదాకా ఎంతో ఆరోగ్యంగా ఉన్నామనుకుంటూ ఉండిపోయిన వారిలో హఠాత్తుగా అధిక రక్తపోటు, మధుమేహం మొదలవుతాయి. ఆ తరువాత విపరీతంగా కీళ్లు సలిపే ఆర్థరైటిస్ సమస్య మొదలవుతుంది. ఆ తరువాత కిడ్నీ సమస్యలు, లివర్, గుండెజబ్బులు ఒక్కొక్కటిగా వచ్చి బెంబేలెత్తిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.

ఇన్‌ఫెక్షన్లు తీవ్రమై...


సిస్టమిక్ ల్యూపస్ ఎరిథిమాటస్ అనే మరో సమస్య కూడా ఉంది. దీనికీ, సొరియాసిస్‌కూ దగ్గరి పోలికలు ఉన్నాయి. ఇది తల మీది నుంచే మొదలవుతుంది. తల మీద ఒక చిన్న మచ్చలా పొక్కులా ఏర్పడుతుంది. అక్కడ ఒకసారి వెంట్రుకలు రాలిపోతే, మళ్లీ ఎప్పుడూ అక్కడ వెంట్రుకలు మొలవవు. తలకే పరిమితం కాకుండా అది శరీరమంతా పాకుతుంది. చాలామంది ఈ సమస్యను సొరియాసిస్‌గానే భావించి ప్రమాదం ఉంది. అప్పటికైనా ఆ సమస్యను గుర్తించకపోతే, గుండె, కిడ్నీలు, లివర్‌ను దుష్ప్రభావాలకు గురిచేసే ప్రమాదం ఉంది. నిజానికి ఇది ఒక ప్రాణాంతక వ్యాధి. అయితే దీనికి, సొరియాసిస్‌కు సంబంధం లేదు. కాకపోతే ఈ ఎస్‌ఎల్‌ఈ, సొరియాసిస్ రెండూ ఆటోఇమ్యూన్ వ్యాధులే. వాస్తవానికి ఈ సమస్య వ్యాధి నిరోధక శక్తిని పెంచడం ద్వారా మాత్రమే తగ్గుతుంది. ఆయుర్వేదంలోని పంచకర్మ, రసాయన చికిత్సలతోనే ఇది సాధ్యమవుతుంది. అల్లోపతిలో స్టెరాయిడ్స్, ఇమ్యూనో సప్రెసార్స్, చివరికి క్యాన్సర్ మందుల దాకా వెళ్తున్నారు. ఇవన్నీ వ్యాధిని తాత్కాలికంగా అణచివేసినా, చివరికి మనిషిని నిస్తేజంగా మార్చి, చివరికి ప్రాణాపాయ స్థితికి తీసుకెళ్తాయి.

ఆయుర్వేదం.. ఒక వరం


చుండ్రు నుంచి సొరియాసిస్ దాకా ఏ చర్మవ్యాధికైనా ఆయుర్వేదంలో సమర్థవంతమైన వైద్య చికిత్సలు ఉన్నాయి. ప్రత్యేకించి, పంచకర్మ, రసాయన చికిత్సల ద్వారా వ్యాధి నిరోధక శక్తిని గణనీయంగా పెంచే అవకాశాలున్నాయి. సొరియాసిస్ తలమీద గుర్తించడం లేదు. ఏవో షాంపూలతో, ఫంగల్ ఇన్‌ఫెక్షన్ మందులతో కాలయాపన చేస్తున్నారు. ఒక దశలో అది శరీరమంతా వ్యాపించిపోతే, బెంబేలెత్తిపోతున్నారు. కాని తలమీద ఉన్నప్పుడే సొరియాసిస్‌ను గుర్తించగలిగితే ఆయుర్వేద మందులతో దాన్ని తొలగించడమే కాకుండా, అది శరీరమంతా పాకకుండా పూర్తిగా నివారించవచ్చు. సొరియాసిస్ తల భాగానికే పరిమితమై ఉంటే శిరోధార చికిత్స ద్వారా తగ్గించవచ్చు. ఆయుర్వేద చికిత్సలు సొరియాసిస్ లక్ష్యంగా చేసినా అవి మున్ముందు రాబోయే పలు రకాల వ్యాధులకు ముందుగానే అడ్డుకట్ట వేస్తాయి. కాకపోతే, వైద్య చికిత్సంటే ఎంతకాలం పడుతుందో ఏమిటో అనుకుంటారు గాని ఏళ్లపర్యంతంగా ఉన్నా సొరియాసిస్‌ను నయం చేయడానికి మూడు నాలుగు వారాల కన్నా ఎక్కువ సమయం పట్టదు.

కాకపోతే జీవితంలో మరోసారి సొరియాసిస్ రాకుండా చేయడానికి మరికొద్ది రోజులు మందులు వాడాల్సి ఉంటుంది. ఏవో తాత్కాలిక వైద్యాలకు వెళ్లడం అంటే సమస్యను చేతులారా జటిలం చేసుకోవడమే. ఎవరైనా సొరియాసిసేమో అన్నప్పుడల్లా .. అబ్బే! అదేం కాదులే అని ఎన్నాళ్లని దాటవేస్తారు.. అది సొరియాసిసేనని ఒప్పుకొనేదాకా మీరు ఆయుర్వేద వైద్య చికిత్సలకు వెళ్లరు. వైద్య చికిత్సలకు వెళ్తే గాని సమస్య నుంచి శాశ్వతంగా విముక్తం కాలేరు.


1812
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles