చీరెకు రూ.1.30 లక్షలు!


Tue,February 26, 2019 01:15 AM

శ్రీదేవి చనిపోయి సంవత్సరం దాటింది. ఆమె చీరెను ఆక్షన్‌కి పంపించింది కుటుంబం. ఆ చీరకు 1.30లక్షల రూపాయలు వచ్చాయి. ఆ డబ్బులను ఒక స్వచ్ఛంద సంస్థకు ఇస్తున్నట్లు ప్రకటించారు.
saree
శ్రీదేవి చనిపోయింది.. ఈ విషయం ఇంకా జీర్ణించుకోని వాళ్లు చాలామంది ఉన్నారు. ఫిబ్రవరి 24తో సంవత్సరం దాటినా ఇంకా ఆమె అందరి మనసుల్లో చెరగని ముద్రలాగే ఉంది. ఈ ముద్ర ఈరోజే కాదు.. ఇంకా ఎప్పటికీ చెరిగిపోదు. అంతటి గొప్ప నటి.. ఎంతగానో ఇష్టపడి దాచుకున్న కోటా చీరను బోనీకపూర్ వేలం పాటకు ఉంచాలని నిర్ణయించుకున్నారు. కన్సర్న్ ఇండియా ఫౌండేషన్‌కి ఆ డబ్బులు అందచేయాలని అనుకున్నారు. చెన్నైకి చెందిన పరిసెరా డాట్ కామ్ అనే వెబ్‌సైట్ ద్వారా ఈ వేలం పాట జరిగింది. ఇందులో వచ్చే డబ్బులను అనాథ పిల్లల చదువులు, మహిళలు, దివ్యాంగుల కోసం పోరాడే ఒక సంస్థను ఎంచుకొని బీయింగ్ జెనరస్.. విత్ శ్రీదేవి ట్యాగ్‌లైన్‌తో ఈ చీరను వేలానికి పెట్టారు. నీలం రంగు అంచుతో చెక్స్ ప్యాటర్న్ ఉన్న నేత చీరను 40వేల బిడ్‌తో కొన్నిరోజుల క్రితం ప్రారంభించారు. అది చివరకి 1.30లక్షల రూపాయలకు అమ్ముడై. ఈ డబ్బులు మంచి కార్యక్రమానికి ఉపయోగపడుతున్నందుకు శ్రీదేవి కుటుంబం ఎంతో సంతోషంగా ఉందని ప్రకటించింది.

270
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles