చీకటి జీవితాల్లో వెలుగులు


Sat,May 18, 2019 12:45 AM

అద్భుతమైన ప్రతిభ ఉన్నా కొందరికి సరైన వేదిక లేక వెలుగులోకి రారు. హేమలత అనే సింగర్ ఈ స్ట్రీట్ సింగర్స్‌ను చూడనంత వరకూ వీళ్లూ విధికే పరిమితమయ్యారు. వీరిని గుర్తించి
సరైన వేదిక కల్పించన తర్వాత పరిస్థితి మారిపోయింది.

hemalatha
హేమలత ముంబైకి చెందిన సింగర్. ఒకరోజు ఓ సంగీత కచేరీకి హాజరవడానికి ముంబైలోని ఓ ప్రాంతానికి వెళ్లింది. రైలుదిగి కొంత దూరం వెళ్లిన ఆమెకు అక్కడే ఓ కొత్త ప్రపంచం కనిపించింది. కొందరు స్ట్రీట్ సింగర్లు పాటలు పాడుతున్నారు. ప్రయాణికులను ఆహ్వానిస్తూ డబ్బులు అడుక్కుంటున్నారు. వారిని చూస్తూ ఆమె ముందుకు సాగింది. ఆమె షెడ్యుల్ ప్రకారం సంగీత కార్యక్రమానికి హాజరైంది. వేదిక మీద పాట పాడుతున్న గాయకున్నీ, పక్కనే మ్యూజిక్ ఇస్తున్న కళాకారులను చూసినప్పుడు ఆమె మనసులో వెంటనే ఒక ఆలోచన మెదిలింది. రైల్వే స్టేషన్ దగ్గర స్ట్రీట్ సింగర్లు పాడుతున్న పాట గుర్తుకు వచ్చింది. వెళ్లి వాళ్లను కలిసింది. వారి దగ్గర ఉన్న సంగీత ప్రతిభను గుర్తించిన ఆమె వాళ్లతో అద్భుతాలు చేయించాలనుకుంది. వారందరినీ చేరదీసి, సరైన శిక్షణ ఇచ్చింది. దీని కోసం ఆమె స్వరాధార్ అనే సంస్థను ఏర్పాటు చేసింది. ముంబైలో ఎలాంటి ఆదరణ లేని కళాకారులను గుర్తించే పని ఆమె భుజానికెత్తుకుంది. ఈ స్వరాధార్ ఏర్పాటు చేయడానికి స్ట్రీట్ సింగర్లను ఒప్పించడానికి ఆమెకు రెండు సంవత్సరాలు పట్టింది. 2010లో స్ట్రీట్ సింగర్లను చూసిన ఆమె వారిని ఒప్పించి, శిక్షణ ఇచ్చి 2012లో ఈ సంస్థను ఏర్పాటు చేసింది. ఇప్పుడు సుమారు ఐదు వందల మంది కళాకారులకు స్వరాధార్ వేదికగా మారింది. వీరితో స్టేజ్ షోలు, కచేరీలు, సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఈ సింగర్లు నెలకు దాదాపు 35వేల ఆదాయం పొందుతున్నారు. చెవిటి, మూగ,దివ్యాంగులకు ఏదీ సాధ్యం కాదు అనే అపోహలను సమాజం నుంచి తొలగించాలన్నదే తమ లక్ష్యం అని హేమలత అంటున్నది.
hemalatha1

236
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles