చిన్నారుల ముఖాల్లో చిరు నవ్వుల కోసం


Sat,February 16, 2019 01:37 AM

ఇప్పటి పోటీ ప్రపంచానికి తగ్గట్గుగా పాఠశాలలు మార్కుల మీద దృష్టి పెడుతున్నాయి కానీ విద్యార్థుల మీద దృష్టి పెట్టడం తగ్గించాయి. నిజానికి పిల్లల్లో ఉన్న మేధోశక్తి సరిగ్గా పట్టుకుంటే వాళ్లలో ఉన్న శక్తి ఏంటో అర్థమవుతుంది. అలా చేసేందుకే ఓ ఆర్గనైజేషన్ ఏర్పడింది.
school
పిల్లల్లో ఉండే సృజనాత్మకతను వెలికి తీయడానికి సరైన వాతావరణం కల్పిస్తే ఆ చిన్ని చిన్ని చేతులే ఎన్నో అద్భుతాలు చేస్తాయి. పాఠశాల గదుల నుంచే ఔరా అనిపించే ప్రయోగాలు చేస్తాయి. ఇవ్వన్నీ వదిలేసి మార్కుల మీద దృష్టి పెడితే ఏ ఫలితం ఉంటుంది? అందుకే పుణెకు చెందిన ఆనంద్ గోపాకుమార్, మోనికాపెస్వానీ, ప్రశాంత్‌కుమార్ అనే యువకులు ద అప్రెంటీస్ ప్రాజెక్ట్ (టీఏపీ)ను రూపొందించారు. పిల్లల్లో ఉండే సృజనాత్మకతను వెలికితీసి, వారికి ఇష్టమైన రంగాల్లో ఆసక్తిని పెంచడానికి అవసరమయ్యే వాతావరణాన్ని కల్పించటం ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశ్యం. అయితే పుణెలోని ఓ పాఠశాలలో 12 ఏండ్ల బాలిక చాలా మౌనంగా, ఎవరితోనూ మాట్లాడకుండా ఉండేది. ఒకరోజు మోనికా పెస్వానీ ఆ పాఠశాలను సందర్శించి మద్యం నివారణపై విద్యార్థులతో ఉపన్యసింపజేసింది. ఈక్రమంలో ఎప్పుడూ మౌనంగా ఉండే ఆ పన్నెండేండ్ల పాపా లేని మద్యం వల్ల కలిగే నష్టాలను అనర్గలంగా, భయం లేకుండా చెప్పింది. తన తండ్రి మద్యానికి బానిసై మరణించటం వల్ల తల్లి, తను ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించింది. ఇన్నాళ్లూ చెప్పడానికి అవకాశం లేకపోవటంతో తనేమీ మాట్లాడలేకపోయానని ఇప్పుడు అందరితో తన పరిస్థితిని పంచుకుంటున్నానని చెప్పింది. దీంతో మోనికా ఇలాంటి వారందరికీ ఒక వాతావరణం ఏర్పాటు చేయాలని, పిల్లలకు వారి ఇష్టమైన వాటి గురించి నేర్పించాలని అనుకుంది. అప్పుడే ఈ ఆర్గనైజేషన్‌ను ప్రారంభించారు. దీని ద్వారా విద్యార్థులకు క్రీడలు, నృత్యాలు, చర్యలు, ఉపన్యాసం, నాటకం, సంగీతం వంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. ఇష్టమైన దాన్ని నేర్చుకోండి, నేర్చుకున్న దాన్ని ఇష్టంగా ఇతరులకు నేర్పించండి అనే లక్ష్యంతో ఈ ఆర్గనైజేషన్ పని చేస్తుందని మోనికా అంటున్నది.

660
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles