చిన్నారుల్లో క్యాన్సర్లు


Fri,February 15, 2019 01:24 AM

క్యాన్సర్ పెద్దవాళ్లకే కాదు.. చిన్న పిల్లలకు కూడా వస్తుంది. ప్రపంచంలో క్యాన్సర్‌కు గురవుతున్న పిల్లల్లో మూడోవంతు ఇండియా నుంచే. ప్రతీ సంవత్సరం 10% చిన్నపిల్లలు క్యాన్సర్ బారిన పడుతున్నారు. నేడు (ఫిబ్రవరి 15) వరల్డ్
చైల్డ్‌హుడ్ క్యాన్సర్ డే సందర్భంగా ఈ కథనం.

Child-Cancer
మన దేశంలో ఏటా కొత్తగా నమోదవుతున్న పదిలక్షల క్యాన్సర్ కేసుల్లో 55 వేలు పిల్లలు, టీనేజర్లకు సంబంధించినవే. క్యాన్సర్ వచ్చిన 10 మంది పిల్లల్లో ఒక్కరు మాత్రమే చికిత్స తీసుకుంటున్నారు.

ల్యుకేమియా: దీని బారిన పడ్డ పిల్లల్లో దాదాపు 30% మందిలో ల్యుకేమియా కనిపిస్తుంది. ఇది ఎముక మజ్జ, రక్తానికి సంబంధించిన క్యాన్సర్.
మెదడులో గడ్డలు:పిల్లల క్యాన్సర్లలో 26% మెదడులో గడ్డలకు సంబంధించినవే. తలనొప్పి, మైకం, మూర్ఛ వంటి లక్షణాలు కనిపిస్తాయి.
న్యూరోబ్లాస్టోమా: పిల్లల క్యాన్సర్లలో ఇవి 6% ఉంటాయి. పొట్ట వాపుగా కనిపిస్తుంది. జ్వరం, ఎముకల నొప్పి వంటి లక్షణాలుంటాయి.
విలమ్స్ ట్యూమర్: కిడ్నీలకు సంబంధించింది. నాలుగు సంవత్సరాల పిల్లల్లో జ్వరం, నొప్పి, కడుపులో తిప్పడం వంటి లక్షణాలుంటాయి.
లింఫోమా: రోగనిరోధక వ్యవస్థలోని లింఫోసైట్లలో ఇవి ప్రారంభమవుతాయి. బరువు తగ్గిపోతారు. చంకలు, గజ్జల్లో గడ్డలు ఏర్పడతాయి.
రబ్డోమయోసార్కోమా: అస్థిపంజరాన్ని అంటుకొని ఉండే కండరాల్లో ఇది వస్తుంది. తల, మెడ, పొట్ట, గజ్జలు కాళూ ్లచేతులకు సోకుతుంది.
రెటినోబ్లాస్టోమా: సాధారణంగా రెండేళ్ల వరకు వయసున్న పిల్లలు ఈ వ్యాధికి గురవుతారు. కళ్లపైకి కాంతిని కేంద్రీకరించి చూసినప్పుడు కనుపాప ఎర్రగా కనిపిస్తుంది. కనుపాప వెనుక రక్తనాళాల వల్ల ఇలా కనిపిస్తుంది.
ఎముకల క్యాన్సర్లు: వేగంగా పెరిగే పొడవాటి ఎముకల్లో ఇది మొదలవుతుంది. రాత్రివేళల్లో తీవ్రంగా ఎముకల నొప్పి.. వాపు కనిపిస్తాయి.
హెపటోబ్లాస్టోమా: కాలేయ క్యాన్సర్ ఇది. పొట్ట వాచిపోవడం దీనిలో కనిపించే మొదటి లక్షణం. ఆకలి మందగిస్తుంది. శరీర బరువు తగ్గుతుంది.
ఎందుకొస్తాయి?: పెద్దవాళ్లలో లాగా జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పర్యావరణ పరిస్థితులతో సంబంధం ఉండడం లేదు. పర్యావరణ సంబంధిత కారణాలు కొన్ని, రేడియేషన్ పిల్లల్లో క్యాన్సర్‌కు కారణమవుతున్నట్టు భావిస్తున్నారు. కాలుష్యం, ధూమపానం చేసేవారికి దగ్గరగా ఉండటం వల్ల వస్తున్నాయి. కొందరిలో తల్లిదండ్రుల నుంచి క్యాన్సర్ సంక్రమిస్తున్నది.
చికిత్సలేంటి?: పిల్లల్లో క్యాన్సర్ రకం, దాని తీవ్రత పైన ఆధారపడి మూడు నెలల నుంచి రెండున్నర సంవత్సరాల వరకు చికిత్సకు సమయం పడుతుంది. క్యాన్సర్ రకాన్ని బట్టి చికిత్స ఉంటుంది. ఇప్పుడు ఆధునిక కీమో, టార్గెటెడ్ థెరపీ మందులెన్నో ఉన్నాయి. ఇమ్యునోథెరపీ అనే నూతన విధానం వచ్చాక క్యాన్సర్ చికిత్సలు బాగా అందుబాటులోకి ఉన్నాయి.

డాక్టర్ శిరీష రాణి
పీడియాట్రిక్ ఆంకాలజిస్ట్
రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్,
బంజారాహిల్స్

390
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles